For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లోనూ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు: 142 ఏళ్ల సంప్రదాయనికి తెరదించిన ఐసీసీ

Players to sport name and jersey number in Tests as ICC gives green signal

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల జెర్సీలపై వారి పేర్లు, ఇష్టమైన నంబర్లు ప్రచురించుకునేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న యాషెస్‌ సిరీస్‌తో ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశముంది. జులై 2019 నుంచి 2021 వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుంది

టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుంది

"టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుంది. టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌కు మళ్లీ ప్రాధాన్యత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. అభిమానులను టెస్టులపై మొగ్గు చూపించేందుకు జెర్సీలపై పేర్లు ప్రచురించుకునేందుకు నిర్ణయం తీసుకున్నాం" అని ఐసీసీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ తెలిపారు.

టెస్టుల్లో తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలతో

టెస్టుల్లో తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలతో

టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. అంతేకాదు టెస్టుల్లో టాస్ వేసేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు బ్లేజర్ల‌తో వెళ్లాలి. వన్డేల్లో మాత్రం అలా కాదు. అయితే, ఈ సంప్రదాయం తాజా నిర్ణయంతో మారనుంది.

ఆగస్టు 1 నుంచి యాషెస్ సిరిస్

ఆగస్టు 1 నుంచి యాషెస్ సిరిస్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ యాషెస్ సిరిస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపించనున్నారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇరు దేశాలకు చెందిన బోర్డులు ఐసీసీకి ప్రతిపాదన పంపాయి. ఈ ప్రతిపాదనకు ఐసీసీ గనుక ఆమోదం తెలిపింది.

ఒకటి నుంచి 99 వరకు తమకు నచ్చిన నంబర్లను జెర్సీలపై

ఒకటి నుంచి 99 వరకు తమకు నచ్చిన నంబర్లను జెర్సీలపై

టెస్టుల్లో తొలిసారి ఆటగాళ్లు పేర్లతో పాటు జెర్సీలపై నంబర్లతో కనిపించనున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభమవుతుంది. ఆటగాళ్లు ఒకటి నుంచి 99 వరకు తమకు నచ్చిన నంబర్లను జెర్సీలపై ముద్రించేందుకు ఎంపిక చేసుకోవచ్చు.

Story first published: Saturday, March 23, 2019, 9:51 [IST]
Other articles published on Mar 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+