For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టులకు వీడ్కోలు: టాప్ గ్రేడ్‌లో ధోనికి కష్టమేనా?

By Nageshwara Rao
Dhoni Will Not Figure In Top Grade | Oneindia Telugu
Players to get new contract. Dhoni may not figure in top grade

హైదరాబాద్: సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ టీమిండియా ఆటగాళ్లకు త్వరలో ఓ శుభవార్తను తెలపనుంది. ఈ శుభవార్త ఏంటంటే బోర్డు పరిధిలో ఆడుతున్న క్రికెటర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందులో భాగంగా ఆటగాళ్ల కోసం కొత్త కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చింది.

కొత్త కాంట్రాక్టు పద్ధతి ప్రకారం బీసీసీఐ ఆటగాళ్లను నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఆ కేటగిరీలు A+, A, B, C గా ఉన్నాయి. అంతకముందు A, B, C మూడు కేటగిరీలుగా మాత్రమే ఉండేవి. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు A+లో చోటు దక్కించుకోనున్నారు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌, రోహిత్‌ శర్మ, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్ తదితర ఆటగాళ్లు ఉండే అవకాశం ఉంది. A+ గ్రేడ్ దక్కించుకున్న ఆటగాళ్లకు ఏడాదికి గాను సుమారు రూ.12 కోట్లు ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనే దానిని నిర్ణయిస్తుంది. A+ గ్రేడ్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కడం అనుమానమేనని అంటున్నారు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని గతంలో కూడా అగ్ర జాబితాలో ఉండటంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ధోనికి ఏ గ్రేడ్ దక్కడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధోని భారత్ తరుపున పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే ఆడుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ ఆడుతూ వన్డేలు, టీ20ల్లో చోటు దక్కించుకోని పుజారా, అశ్విన్, రవీంద్ర జడేలాలు ఏ గ్రేడ్‌లో ఉంటారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది.

వీళ్లకి సెలక్షన్ కమిటీ A+ గ్రేడ్‌ స్థాయి ఇవ్వకపోతే ఆర్ధికంగా పెద్ద దెబ్బే. మార్చి 3న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. ఈలోగా ఆటగాళ్లకు బోర్డు ఈ శుభవార్త ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

పెంచిన జీతాలకు బీసీసీఐ ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళీ, జూనియర్ (అండర్-19) క్రికెటర్లు భారీ జీతాలను అందుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని బీసీసీఐ పాలకుల కమిటీతో సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Wednesday, February 28, 2018, 20:09 [IST]
Other articles published on Feb 28, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+