కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలి: కోహ్లీ


హైదరాబాద్: కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగాలని, సూపర్ పవర్‌గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని కోహ్లీ చెప్పాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "పరిమిత ఓవర్ల క్రికెట్ ముఖ్యమైందే. అందులో రాణించాలనుకోవడంలో తప్పులేదు" అని అన్నాడు.
"అయితే వాటికే పరిమితమవడం... టెస్టులను చిన్నచూపు చూడటం తప్పు. ఏ ఆటగాడైనా బాగా శ్రమిస్తేనే నాణ్యమైన టెస్టు క్రికెటర్ అవుతాడు. బాగా సాధన చేయాలి. ఒక్క పరుగు రాకపోయినా రెండు గంటలు బ్యాటింగ్ చేసేందుకు సుముఖంగా ఉండాలి. కుర్రాళ్లు చేయాల్సిందిదే. అయితే, ప్రస్తుతం కుర్రాళ్లు చాలామంది సంప్రదాయ టెస్టులకు విలువ ఇవ్వడం లేదు" అని కోహ్లీ అన్నాడు.

టెస్టు క్రికెట్‌పై కోహ్లీ
"ఇది వారి కెరీర్‌కు ఎంతమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే ఒత్తిడి ఎదుర్కోలేక మానసిక సమస్యలు తప్పవు. ఏదో రెండు గంటలు ఆడటం, కొన్ని ఓవర్లు వేయటం ఆటను ముగించడం సరైన పద్ధతి కానేకాదు. కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలి. మన విజన్‌ను బట్టి అభిమానులుంటారు. టెస్టుల్ని ఆసక్తికరంగా ఆడితే తప్పకుండా ప్రేక్షకులు పెరుగుతారు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

తమ జట్టు తిరుగులేని శక్తిగా
టెస్టు క్రికెట్లో తమ జట్టు తిరుగులేని శక్తిగా అవతరించాలన్న తన కోరికను కోహ్లీ మరోసారి వెల్లడించాడు. "భారతీయులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇదే మన బలం. ఐదు రోజుల ఆటను గౌరవిస్తే, మనం టెస్టుల్ని శాసిస్తే, సంప్రదాయ క్రికెట్ అగ్రస్థానంలో ఉంటుంది. కానీ రానున్న సంవత్సరాల్లో భారత్ టెస్టు క్రికెట్లో గొప్ప శక్తిగా నిలవాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకోసం ప్రయత్నస్తున్నాం" అని అన్నాడు.

నా పనిని శాస్త్రి మరింత తేలిక చేస్తున్నాడు
ఇక, కెప్టెన్‌గా తన పనిని కోచ్ రవిశాస్త్రి మరింత తేలిక చేస్తున్నాడని కోహ్లి చెప్పాడు. ‘‘రవిశాస్త్రి నాతో తన అభిప్రాయాన్ని నిజాయితీగా చెబుతాడు. ఓ ఘటన నాకింగా గుర్తుంది. గతేడాది ఇంగ్లాండ్‌లో ఓ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించా. అప్పుడు రవిశాస్త్రి నాతో మాట్లాడాడు" అని కోహ్లీ వివరించాడు.

అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో
‘బ్యాటింగ్‌కు సంబంధించి నీతో ఏమీ మాట్లాడను. కారణం.. నాతో పాటు ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఆడావు. కానీ కెప్టెన్‌గా ‘ఈ జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో, మంచి వ్యూహ రచన ఎలా చేయాలో ఆలోచించు' అని అన్నాడు. శాస్త్రి మాటలపై ఆలోచించా. ‘కెప్టెన్సీ అంటే నువ్వు అనుకుంటున్నదాని కంటే ఎక్కువ' అని అతడు అన్నట్లు అనిపించింది'' అని కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications