Virat Kohliని ఔట్‌ చేయాలంటే.. మైండ్‌గేమ్స్‌ తవ్వవు! ఆ వ్యూహాలు అమలుచేస్తేనే బుట్టలో పడతాడు!

కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయాలంటే మైండ్‌గేమ్స్‌ తప్పవని దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ అన్నాడు. కోహ్లీని పెవిలియన్‌ పంపించేందుకు తాను ఎలాంటి వ్యూహాలు అమలు చేసేవాడో స్టెయిన్‌ తెలిపాడు. 2004లో అరంగేట్రం చేసిన స్టెయిన్‌ తన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. కొన్నేళ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే వరుసగా గాయాల పాలవ్వడం, ఫిట్‌నెస్‌ కోల్పోవడం, వయసు పెరగడంతో టెస్ట్ ఫార్మాట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు.

IPL 2021: బీసీసీఐ ప్రయత్నాలు సఫలం.. వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం!!IPL 2021: బీసీసీఐ ప్రయత్నాలు సఫలం.. వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం!!

మైండ్‌గేమ్స్‌ ఆడాల్సిందే:

మైండ్‌గేమ్స్‌ ఆడాల్సిందే:

2008లో టీమిండియాలో అడుగుపెట్టిన విరాట్‌ కోహ్లీ అంచలంచలుగా ఎదుగుతూ టాప్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య టెస్టు సిరీసులు జరిగినప్పుడు డేల్‌ స్టెయిన్‌, కోహ్లీ మధ్య రసవత్తరమైన పోటీ ఉండేది. 'విరాట్‌ కోహ్లీని పెవిలియన్ చేర్చాలంటే.. కచ్చితంగా మైండ్‌గేమ్స్‌ ఆడాల్సిందే. నేనైతే షార్ట్‌లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టేందుకు చూసేవాడిని. దేహానికి, ప్యాడ్లకు గురిపెట్టి వేస్తానని, బంతులు వేగంగా విసురుతానని కోహ్లీకి తెలిసేలా చేసేవాడిని. అతడు బంతులు ఆడేలా, పుల్‌ చేసేలా ఉసిగొల్పేవాడిని. ఎందుకంటే అలా ఆడినప్పుడు అతడిలోని కొన్ని బలహీనతలు బయటపడేవి' అని ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో స్టెయిన్‌ చెప్పాడు.

అప్పుడే బ్బంది పెట్టేవాడిని:

అప్పుడే బ్బంది పెట్టేవాడిని:

బంతులను స్వింగ్‌ చేస్తూ విరాట్ కోహ్లీని వికెట్ల ముందు ఎలా దొరకబుచ్చుకొనేవాడో దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ వివరించాడు. బంతిని ముందుగానే డ్రైవ్‌ చేసే అలవాటు అతడికి ఉండేదని పేర్కొన్నాడు. 'నిజానికి డ్రైవ్‌ షాట్లు కోహ్లీ బాగానే ఆడతాడు. అయినప్పటికీ నేను డ్రైవ్‌ చేసేలాగే బంతులు వేసేవాడిని. ఆ తర్వాత కాస్త బౌన్స్‌ జతచేసి స్వింగ్‌ చేసేవాడిని. ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్‌, కీపర్‌ క్యాచ్‌ కోసం ప్రయత్నించేవాడిని. సాధారణంగా ప్రతి బ్యాటర్‌ తొలి 15-20 బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతారు. కోహ్లీని ఆ సందర్భంలోనే ఇబ్బంది పెట్టేవాడిని' అని స్టెయిన్‌ పేర్కొన్నాడు.

టీమిండియాదే బ్యాటింగ్:

టీమిండియాదే బ్యాటింగ్:

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడుతుండగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో డేల్‌ స్టెయిన్‌ ఆడుతున్నాడు. ఫైనల్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఏజీస్‌ బౌల్‌ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. శనివారం వర్షం పడకపోవడంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 19, 2021, 16:06 [IST]
Other articles published on Jun 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X