సోషల్ మీడియా వద్దు... అవుట్‌డోర్ గేమ్స్ ముద్దు: కోహ్లీ
హైదరాబాద్: ఫిట్‌నెస్‌ను తన జీవితంలో భాగంగా చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రీడలపై దృష్టి సారించాలని దేశ యువతకు సలహా ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సోషల్ మీడియాలో సమయం వృథా చేసుకోవడంకంటే క్రీడలపై దృష్టి సారించాలని యువతకు కోహ్లీ హితవు చెప్పాడు.

ప్యూమాతో కలిసి బ్రాండ్ వన్8ను మార్కెట్లోకి విడుదల చేసిన కోహ్లీ
నేటి యువత క్రీడలకంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం వెళ్లదీసేందుకే ప్రాధాన్యమిస్తోందని, ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోహ్లీ అన్నాడు. ఫోన్‌లు, కంప్యూటర్లలో వీడియో గేమ్‌లు ఆడటం మాని, మైదానంలో ఆటలాడాలని సూచించాడు. ప్యూమాతో కలిసి కోహ్లీ తన సొంత దుస్తుల బ్రాండ్ వన్8ను గురువారం మార్కెట్లోకి విడుదల చేశాడు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ యువత శారీరక దృఢత్వంపై దృష్టి సారించడంతో పాటు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని కోరాడు. 'ఈ రోజుల్లో పిల్లలందరూ వీడియో గేమ్స్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు ఎవరూ రావడం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ చాలా ముఖ్యం. నా సలహా ఒక్క యువతకే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరికీ' అని కోహ్లీ అన్నాడు.

నేనూ సామాజిక మాథ్యమాలకు ఆకర్షితుడనయ్యాను
దేశంలోని యువకులు సామాజిక మధ్యమాలకు వీలైనంత దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. 'గతంలో నేనూ సామాజిక మాథ్యమాలకు ఆకర్షితుడనయ్యాను. అయితే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తెలుసుకుని క్రీడలను ఎంచుకున్నాను' అని కోహ్లీ చెప్పాడు.

స్ధానిక యువకులతో కలిసి పుట్‌బాల్ ఆడిన కోహ్లీ
ఈ సందర్భంగా స్థానిక యువతీ యువకులతో కలిసి కోహ్లీ కాసేపు సరదాగా పుట్‌బాల్ ఆడాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 16న ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications