For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పదకొండేళ్లుగా జట్టులో ఉన్నా, టెస్టు క్రికెట్ ఆడింది లేదు'

రెగ్యులర్ ప్రాతిపదికిన టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు తమను అహ్వానించడం లేదని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్‌ రహీమ్ వ్యాఖ్యానించాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: రెగ్యులర్ ప్రాతిపదికిన టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు తమను అహ్వానించడం లేదని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్‌ రహీమ్ వ్యాఖ్యానించాడు. భారత్‌లో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అతడు మంగళవారం ఉప్పల్ స్టేడియంలో మీడియాతో మాట్లాడాడు.

ఈ ఏడాది బంగ్లాదేశ్ విదేశాల్లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందని చెప్పాడు. మరిన్ని టెస్టులు ఆడే అవకాశాలను కల్పిస్తే మరింతగా మెరుగవుతామని ముష్ఫికర్‌ రహీమ్ పేర్కొన్నాడు. 'నేను పదకొండేళ్లుగా జట్టులో ఉన్నా. కానీ, టెస్టు క్రికెట్‌ ఎక్కువగా ఆడింది లేదు' అని చెప్పాడు.

రెండేళ్ల విరామం తర్వాత మేం విదేశ పర్యటనకు వెళ్లాం

రెండేళ్ల విరామం తర్వాత మేం విదేశ పర్యటనకు వెళ్లాం

'దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మేం విదేశ పర్యటనకు వెళ్లాం. మాకు ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం ఇవ్వండి. అప్పుడు మా ఆట మెరుగైందో లేదో చెప్పండి. మేం ఎక్కువ టెస్టులు ఆడితే మరింతగా మెరుగవుతాం. ఇక ఈ మ్యాచ్‌లో నెంబర్‌ వన్‌ జట్టును ఎదుర్కోబోతున్నాం' అని అన్నాడు.

టెస్టు క్రికెట్ అంటే ఒకరో, ఇద్దరో రాణిస్తే గెలిచేది కాదు

టెస్టు క్రికెట్ అంటే ఒకరో, ఇద్దరో రాణిస్తే గెలిచేది కాదు

'టెస్టు క్రికెట్‌ అంటే ఒకరో, ఇద్దరో రాణిస్తే గెలిచేది కాదు. న్యూజిలాండ్‌లో మాకు అదే అనుభవం ఎదురైంది. సమష్టిగా ఆడి మ్యాచ్‌లో పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాం. మాలో చాలా మంది భారత గడ్డపై తొలిసారి ఆడుతున్నారు. అందువల్ల మేమంతా అత్యుత్తమ స్థాయిలో ఆడాలి' అని పేర్కొన్నాడు.

ఇక్కడి పరిస్థితులు షకీబల్‌కు బాగా అలవాటు

ఇక్కడి పరిస్థితులు షకీబల్‌కు బాగా అలవాటు

'ఇక్కడి పరిస్థితులు షకీబల్‌కు బాగా అలవాటు. అతనితోపాటు తైజుల్‌ ఇస్లాం, మోహ్దీ హసన్‌ రూపంలో మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. వారు నేర్చుకునేందుకు ఈ టెస్టు అవకాశం కల్పిస్తోంది. భారత్‌లాంటి జట్టుపై వ్యూహాలు పన్నడం కాదు వాటిని సమర్థంగా అమలు చేయడం ముఖ్యం' అని ముష్ఫికర్‌ రహీమ్ అన్నాడు.

ఆధిపత్యం ప్రదర్శించగలమని విశ్వాసం

ఆధిపత్యం ప్రదర్శించగలమని విశ్వాసం

వన్డేలు, టి20ల్లో మేం చూపిస్తున్న ఆటను ఇక్కడ ప్రదర్శిస్తే టెస్టులో ఏదో ఒక దశలో ఆధిపత్యం ప్రదర్శించగలమని విశ్వాసం ఉందని పేర్కొన్నాడు. కాగా, టెస్టుల్లోకి అడుగు పెట్టిన 18 ఏళ్ల తర్వాత గానీ భారత గడ్డపై ఆడే అవకాశం రాని ఆ జట్టు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తోంది.

18 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టీమిండియా

18 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టీమిండియా

మరోవైపు స్వదేశంలో వరుసగా 18 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టీమిండియా ఈ టెస్టులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న కోహ్లీసేన అదే జోరుని కొనసాగించాలని చూస్తోంది. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌ను ఒక మ్యాచ్‌లో ఓడించి రెండు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకున్న బంగ్లాదేశ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+