Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టులో కోహ్లీపై అనుకున్న ప్లాన్ సరిగ్గా అమలు చేశాం

Plan was to keep Kohli quiet, says Philander

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించడానికి కారణం టెస్టు మ్యాచ్‌కి ముందు అనున్న ప్లాన్‌లను సరిగ్గా అమలు చేయడమేనని దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నార్ ఫిలాండర్ అన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిసి ఫిలాండర్ 9 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

ఈ టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫిలాండర్‌కు ఇది తన టెస్టు కెరీర్‌లోనే అత్యుత్తమం. దీంతో తొలి టెస్టులో అతడు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఫిలాండర్ మాట్లాడాడు.

'విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు, అతడిని కట్టడి చేయడం ఎంతో ముఖ్యం. రెండున్నర ఓవర్ల పాటు కోహ్లీకి బంతి అందకుండా ఆఫ్ స్టంప్‌కు అవతలగా బంతులు వేశాం. దీంతో అతడు క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకునే అవకాశం రాలేదు. ఆ తర్వాత అతనికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా త్వరగా ఔట్ చేశాం' అని ఫిలాండర్ తెలిపాడు.

'కాపాడుకోవాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో మా జట్టులో ఒకింత కంగారు మొదలైంది. కోహ్లి క్రీజులో ఉంటే.. ఓ వ్యూహం ప్రకారం మైదానంలో నడుచుకోవాలని నిర్ణయించుకున్నాం. అతడ్ని రెచ్చగొట్టడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదనుకున్నాం. అలా కోహ్లి సహనంతో ఆడుతున్న సమయంలోనే.. అతడ్ని ఔట్ చేయాలనేది మా ప్లాన్. ఎల్బీ ఔట్ నిర్ణయంపై కోహ్లీ డీఆర్ఎస్‌కి వెళ్లినా.. నాలో ఏమీ కంగారుకలగలేదు. ఎందుకంటే.. నాకు తెలుసు ఆ బంతి సరిగా వికెట్ల వైపు వెళ్తోందని' అని ఫిలాండర్ వివరించాడు.

ఓవర్ల మధ్యలో వైవిధ్యమైన బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం వల్లే త్వరగా ఔట్ చేయగలిగామని ఫిలాండర్ వెల్లడించాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన ఫిలాండర్ 42 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి సఫారీల విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 19:35 [IST]
Other articles published on Jan 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+