Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండీస్‌పై భారత్ వ్యూహం ఇదే, కోహ్లీ పక్కా ప్లాన్‌తో..

అంటిగ్వా: తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్, ఆ తర్వాత బౌలింగులోను దూకుడు ప్రదర్శించింది. భారత్ తొలి ఇన్నింగుస్లో ఎనిమిది వికెట్లకు 566 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. మన బౌలర్లు విజృంభించడంతో విండీస్ తొలి ఇన్నింగ్సులో 243 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ఆడుతోంది.

ఈ సందర్భంగా భారత్ వ్యూహంపై ఉమేష్ యాదవ్ మాట్లాడాడు. మెయిడిన్‌ ఓవర్లతో పరుగులను నియంత్రిస్తూ విండీస్ బ్యాట్స్‌మెన్ల పైన ఒత్తిడి పెంచడమే తొలి టెస్టులో తమ వ్యూహమని చెప్పాడు.

వీలైనన్ని ఎక్కువ మెయిడిన్‌ ఓవర్లు వేయాలని మ్యాచ్‌కు ముందే నిర్ణయించుకున్నామని, అందులో భాగంగానే లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసురుతూ విండీస్‌ బ్యాట్స్‌మెన్లు పరుగులు చేసేందుకు శ్రమించేలా చేశామని, ఇలా వారిపై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యామని, కాబట్టే తక్కువ స్కోరుకు ఆలౌట్‌ చేయగలిగామన్నాడు.

భారత్ వర్సెస్ విండీస్

భారత్ వర్సెస్ విండీస్

ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ.. విండీస్ బ్యాట్సుమెన్ పైన ఒత్తిడి పెరగడంతో పాటు వారు అసహనానికి గురై త్వరగా వికెట్లు సమర్పించుకున్నారని చెప్పాడు.

భారత్ వర్సెస్ విండీస్

భారత్ వర్సెస్ విండీస్

పిచ్ చాలా స్లోగా ఉందని, కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ కోసం అటాకింగ్ ఫిల్డీంగ్ ఏర్పాటు చేసి విండీస్ పైన ఒత్తిడి పెంచమని చెప్పాడని ఉమేష్ యాదవ్ చెప్పాడు.

భారత్ వర్సెస్ విండీస్

భారత్ వర్సెస్ విండీస్

గాలి తీవ్రంగా వీస్తుండటంతో 20 వికెట్లు తీయడం కష్టమని భావించామని, అయితే పక్కా గేమ్ ప్లాన్‌ను అమలు చేసి విండీస్‌ను త్వరగా అవుట్ చేశామని ఉమేష్ యాదవ్ చెప్పాడు.

భారత్ వర్సెస్ విండీస్

భారత్ వర్సెస్ విండీస్

గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన భారత్‌ 566/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా, అనంతరం సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ 243 పరుగులకే భారత్‌ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది.

భారత్ వర్సెస్ విండీస్

భారత్ వర్సెస్ విండీస్

పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌ (4/41), మహ్మద్‌ షమీ (4/66) విజృంభించడంతో విండీస్‌ వికెట్లు టపటపా పడ్డాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+