Ranji Trophy 2022: బెంగాల్ క్రికెట్ జట్టులో రాష్ట్ర మంత్రికి చోటు

ఈ సారి రంజీ ట్రోఫీలో ఓ మంత్రి ఆడబోతున్నారు. ఆ మంత్రి గతంలో భారత జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎవరో కాదు మనోజ్ తివారీ. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వంలో మనోజ్ తివారీ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. 2020లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున బీజేపీ అభ్యర్థి రతిన్ చక్రవర్తిపై తివారీ విజయం సాధించారు.

బెంగాల్ జట్టులో మనోజ్‌కు చోటు
మనోజ్ తివారీకి రాజకీయ నాయకుడిగా కంటే క్రికెటర్‌గానే ఎక్కువ గుర్తింపు ఉంది. గతంలో రంజీల్లో బెంగాల్ జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. అయితే జాతీయ జట్టులో ఎక్కువ కాలం చోటు నిలుపుకోలేకపోయారు. అయితే మంత్రి అయిన ఏడాది తర్వాత తివారీ రంజీల్లో ఆడడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2022కు బెంగాల్ మేనేజ్‌మెంట్ తమ టీంను ప్రకటించింది. మొత్తం 22 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించగా అందులో సీనియర్ ఆటగాడైన 36 ఏళ్ల మనోజ్ తివారీకి కూడా చోటు దక్కింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్‌ను కెప్టెన్‌గా నియమించింది.

మనోజ్ తివారీ రికార్డులు
మనోజ్ తివారీ భారత జట్టు తరఫున 12 వన్డే మ్యాచ్‌లు ఆడి 26 సగటుతో 287 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అత్యధిక పరుగులు 104. 5 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక 3 టీ20లు ఆడి 15 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 28 సగటుతో 1695 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు 75 నాటౌట్. ఒక వికెట్ తీసుకున్నాడు. చివరగా 2020లో సౌరాష్ట్రతో రంజీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 125 మ్యాచ్‌లు ఆడి 50 సగటుతో 8965 పరుగులు చేశాడు. 27 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 303 పరుగులు. ఇక లిస్ట్ ఏ క్రికెట్‌లో 163 మ్యాచ్‌లు ఆడి 42 సగటుతో 5466 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 151.

13 నుంచి రంజీ టోర్నీ
ఈ నెల 13 నుంచి జరగనున్న ఈ టోర్నీలో బెంగాల్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో త్రిపురతో తలపడనుంది. అంతకుముందు ఈ నెల 6, 7 తేదీల్లో రెండు రోజుల వామప్ మ్యాచ్‌లో భాగంగా పృథ్వీషా నేతృత్వంలోని ముంబైతో తలపడనుంది. గ్రూప్ బీలో బెంగాల్‌తోపాటు విదర్భ, రాజస్థాన్, కేరళ, హర్యానా, త్రిపుర జట్లు కూడా ఉన్నాయి. కాగా బెంగాల్ జట్టులోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

బెంగాల్ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), మనోజ్ తివారీ, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ రామన్, సుదీప్ ఘరామి, అభిషేక్ దాస్, వ్రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, అభిషేక్ పోరెల్, షాబాజ్ అహ్మద్, సయన్ శేఖరేల్, సయన్ శేఖర్ దెప్‌డాల్, సయాన్ శేఖరేల్ మోన్‌షేక్ కుమార్, కాజీ జునైద్ సైఫీ, సకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, గీత్ పూరి, నీలకంఠ దాస్ మరియు కరణ్ లాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications