PKBS vs SRH: అబ్బా సాయిరాం.. మా 'కావ్య' పాప నవ్వింది! ఇక ఈ జీవితానికి ఇది చాలబ్బా!

IPL 2021,SRH VS PBKS: Ma #KaviyaMaran Papa Happy, Finally Smiles కావ్య మారన్ మీమ్స్‌| Oneindia Teugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొంది. పంజాబ్‌ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్‌ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37; 37 బంతుల్లో 3x4, 1x6) ఔటైనా.. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (63 నాటౌట్‌; 56 బంతుల్లో 3x4, 3x6), కేన్‌ విలియమ్సన్‌ (16 నాటౌట్‌; 19 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది.

KKR vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. నరైన్ ఆగయా! బ్రేవో, హర్భజన్‌ అవుట్!

స్టేడియంలో కావ్య నవ్వులు

మూడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఎట్టకేలకు సూపర్ విక్టరీ కొట్టడంతో ఆ జట్టు అభిమానులు ఖుషీ అవుతున్నారు. తొలి విజయం కావడంతో సన్‌రైజర్స్‌ యాజమాన్యం, ఆటగాళ్ల మోహంలో నవ్వులు విరిశాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ టీమ్ సీఈవో కావ్య మారన్ ఆనందంలో ఉన్నారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు వికెట్లు తీసినప్పుడు, బ్యాట్స్‌మన్‌ బౌండరీలు బాదినపుడు స్టేడియంలో ఆమె సందడి చేశారు. ఇక విజయం సాధించిన తర్వాత ఆమె ఒక్కసారిగా లేచి నవ్వులు పూయించారు. స్టేడియంలో కావ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మా 'కావ్య' పాప నవ్వింది

సన్‌రైజర్స్‌ టీమ్ సీఈవో కావ్య మారన్ వాంఖడేలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట మీమ్స్‌ ట్రెండ్ అవుతున్నాయి. ఇక కొంతమంది తెలుగు ఫాన్స్ అయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అబ్బా సాయిరాం.. మా 'కావ్య మారన్' పాప నవ్వింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఎట్టకేలకు కావ్య మారన్ ఈరోజు నవ్వింది' అని మరొకరు ట్వీట్ చేశారు. 'పాప నవ్వింది', 'ఇగ మాములుగా ఉండదు పార్టీ', 'చివరగా ఆమె ముఖం మీద చిరునవ్వు వచ్చింది. థాంక్స్ సన్‌రైజర్స్‌' అంటూ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏ తెలుగు అభిమానిని కదిలించినా.. కావ్య పాప గురించే మాట్లాడుతున్నారు.

హీరోయిన్‌ను తలపించేలా:

29 ఏళ్ల కావ్య మారన్ మరెవరో కాదు.. త‌మిళ‌నాడు మీడియా కింగ్ క‌ళానిధి మార‌న్ ఏకైక కూతురు. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానల్స్‌కు సీఈవో. స‌న్ నెట్‌వ‌ర్క్ చానెల్స్ బిజినెస్‌లోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. స‌న్‌రైజ‌ర్స్ మ్యాచులలో కావ్య మారన్.. తన అందచందాలతో అందరి కళ్లను తనవైపుకు తిప్పుకున్నారు. స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు.. బౌండరీలు, సిక్సులు బాదినప్పుడు ఆమె చేసే సెలెబ్రేషన్స్ వైరల్ అయ్యాయి. సినిమా హీరోయిన్ తలపించేలా ఉన్న కావ్య.. ప్రతీ మ్యాచ్‌లో తన అందచందాలతో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు.

2018 సీజ‌న్‌లో తొలిసారి

కావ్య మారన్ తొలిసారి 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో కనిపించారు. కోల్‌క‌తా నైట్ ‌రైడ‌ర్స్ మ్యాచ్‌లో ఆమె క‌నిపించి సందడి చేశారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. కెమెరాలు సైతం ఆ అమ్మాయినే పదేపదే క్యాప్చర్ చేశాయి. ఇక ఇప్పడు మ్యాచులు జరుగుతుండగా స్టాండ్స్‌లో కూర్చొని సన్‌రైజర్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 21, 2021, 20:54 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X