పిచ్‌పై ప్రేక్షకుడు: పరుగెత్తుకుంటూ వచ్చి, బెయిల్స్ పడేసి..!

మాంఛెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్టేడియం భద్రతా వైఫల్యాన్ని వేలెత్తి చూపించే ఘటన ఇది. మ్యాచ్ రంజుగా కొనసాగుతున్న సమయంలో ఓ యువకుడు పిచ్‌పైకి దూసుకొచ్చాడు. బెయిల్స్‌ను కింద పడేసి మరీ వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. ఫలితంగా- కొన్ని నిమిషాల పాటు మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
397 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్లు రహమత్ షా, హష్మతుల్లా షహీది క్రీజులో ఉన్నారు. అప్పటికి ఆప్ఘన్ జట్టు స్కోరు రెండు వికెట్లను కోల్పోయి 101 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 24 ఓవర్‌ను బౌల్ చేస్తున్న సమయంలో ఓ యువకుడు అనూహ్యంగా పిచ్‌పైకి దూసుకొచ్చేశాడు.
తెల్లరంగు స్వెట్టర్, నలుపురంగు జీన్స్ ప్యాంట్‌ను ధరించిన ఆ యువకుడు గ్రిల్స్ దాటుకుని నేరుగా పిచ్‌పైకి వచ్చాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను గిరాటేశాడు. వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు. అతణ్ని పట్టుకోవడానికి భధ్రతా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. ఫలితంగా- కొద్దిసేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం యథావిధంగా కొనసాగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications