
ప్రపంచకప్‌లో ప్రయాణం..
టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థిపై భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. గతేడాది పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి పగ తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మాజీ సారధి విరాట్ కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. ఆ తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. అయితే సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమి చవి చూసింది. ఆ తర్వాత పుంజుకొని చివరి రెండు లీగ్ మ్యాచుల్లో మళ్లీ విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా ఫామ్ అందుకున్నాడు.

భారత్ ఆశలు వీళ్లపైనే..
ఈ సెమీఫైనల్ మ్యాచులో కూడా నిలకడగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు అత్యంత కీలకం కానున్నారు. ఇటీవల ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్‌తోపాటు అద్భుతంగా సత్తా చాటుతున్న అర్షదీప్ సింగ్, భువనేశ్వర్, షమీ, పాండ్యా కూడా బౌలింగ్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఫామ్‌తో సతమతం అవతున్న రోహిత్ కూడా గాడిన పడితే భారత్‌కు తిరుగుండదు.

ఇంగ్లండ్‌లో వీళ్లే కీలకం..
ఇంగ్లండ్ జట్టులో కొత్త బంతితో నిప్పులు చెరిగే మార్క్ వుడ్, శామ్ కర్రాన్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తారు. బ్యాటింగ్‌లో చూసుకుంటే కెప్టెన్ జోస్ బట్లర్, ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆ జట్టులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మొయీన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచుల్లో ఇంగ్లండ్ ఫీల్డింగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అదొక్కటే ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశం.

పిచ్, వాతావరణం..
అడిలైడ్ ఓవల్ పిచ్‌లో కొంత బౌన్స్ ఉంటుంది. దానికి తోడు స్క్వేర్ బౌండరీలు కొంచెం చిన్నవి. దీంతో బ్యాటర్లు భారీ షాట్లు కొట్టేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే కొత్త బంతితో బౌలింగ్ చేసే సమయంలో బౌలర్లకు మంచి బౌన్స్‌తోపాటు స్వింగ్ కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. బ్యాటర్లకు స్వర్గధామంగా ఈ పిచ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్పిన్నర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించదని, కానీ గత మ్యాచుల్లో స్పిన్నర్లకు కూడా బాగానే వికెట్లు దక్కాయని తెలుస్తోంది. ఇక వాతావరణం పరిశీలిస్తే.. అడిలైడ్‌లో బుధవారం రాత్రి మొత్తం వర్షం కురిసింది. అయితే ఇది మరీ అంత భారీ వర్షం కాదు. అలాగే మళ్లీ ఇక్కడ శనివారమే వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే సెమీఫైనల్‌లో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం దాదాపు శూన్యమని అధికారులు అంటున్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు ఆకాశం మేఘావృతం అయి ఉన్నప్పటికీ.. వర్షం పడే ఛాన్స్ మాత్రం లేదని, ఈ మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా జరుగుతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications
