న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి.. మూడో వన్డేలో పరుగుల వరదే..!

Pitch and Weather report of Holkar Stadium for INDvsNZ third ODI

శ్రీలంకపై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. న్యూజిల్యాండ్‌పై కూడా అదే ఫలితం కోసం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.

ఈ క్రమంలోనే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగే మూడో వన్డే కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఇక్కడి పిచ్, వాతావరణం ఎలా ఉంటాయంటే..

బౌలర్లకు సవాల్..

బౌలర్లకు సవాల్..

హోల్కర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం అని చెప్పాలి. ఇక్కడ బౌలర్లు ఏమీ చేయలేరు. అసలే చిన్న స్టేడియం కావడంతో సులభంగా సిక్సర్లు బాదే అవకాశం ఉంది. ఇక్కడ అతి స్క్వేర్ బౌండరీ 56 మీటర్లు కాగా.. స్ట్రెయిట్ బౌండరీ 65 మీటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. దానికి తోడు పిచ్ నుంచి బౌలర్లు పెద్దగా సహకారం కూడా ఉండదు. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 307 పరుగులు అంటేనే పిచ్ ఎంతలా బ్యాటర్లకు అనుకూలిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

టాస్ గెలిస్తే..

టాస్ గెలిస్తే..

ఇక వాతావరణం విషయానికొస్తే.. ఇండోర్‌లో పూర్తి మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదు. అయితే చీకటి పడిన తర్వాత మంచు ప్రభావం ఉండొచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో అత్యధికంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉండే ఉష్ణోగ్రత.. మ్యాచ్ జరిగే కొద్దీ తగ్గుతూ అత్యల్పంగా 13 డిగ్రీలకు చేరుకోవచ్చని నిపుణుల అంచనా. దీంతో ఆటపై మంచు ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటుందని అంచనా.

స్టేడియం హిస్టరీ..

స్టేడియం హిస్టరీ..

అయితే ఈ మ్యాచ్ హిస్టరీ ప్రకారం చూస్తే.. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఐదు అంతర్జాతీయ వన్డేలు జరగ్గా.. వీటిలో మూడింట ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండింట్లో ఛేజింగ్ జట్టు విజేతగా నిలిచింది. అలాగే ఇక్కడ అత్యధిక స్కోరు చేసిన జట్టు టీమిండియానే. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 418 పరుగుల భారీ స్కోరు చేసింది. 2015లో సౌతాఫ్రికా 215 పరుగులకు ఆలౌట్ అయింది. అదే ఇక్కడ అత్యల్ప స్కోరు. ఈ లెక్కన భారత్, న్యూజిల్యాండ్ మధ్య మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Tuesday, January 24, 2023, 8:27 [IST]
Other articles published on Jan 24, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X