Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేన చరిత్ర అనుమానమే!: పింక్ జెర్సీలో డివిలియర్స్ ప్రపంచ రికార్డు

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న దక్షిణాఫ్రికాకు ఓ రికార్డు ఊరట కలిగిస్తోంది. సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహెన్స్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం నాలుగో వన్డే జరగనుంది. మూడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ జట్టుని గట్టెక్కించేందుకు నాలుగో వన్డేలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనున్నాడు. భారత్‌తో జరిగే నాలుగో వన్డే కోసం డివిలియర్స్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాడని ఈ మేరకు దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటన చేసింది.

 అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు

అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు

మోడ్రన్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు. వైవిధ్యమైన షాట్లతో క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించలడు. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టులోని మిగతా ఆటగాళ్లతో పోలిస్తే డివిలియర్స్ స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఎదుర్కొనగల సత్తా ఉంది. ఇక, నాలుగో వన్డే జరిగే వాండరర్స్ స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ చెలరేగిపోతాడు.

 గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరం

గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరం

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో డివిలియర్స్ గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. తిరిగి నాలుగో వన్డేలో జట్టులో చోటు దక్కించుకున్న డివిలియర్స్‌పైనే దక్షిణాఫ్రికా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా నాలుగో వన్డేని ‘పింక్‌ వన్డే'గా పరిగణిస్తున్నారు.

గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దక్షిణాఫ్రికా జట్టు

గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దక్షిణాఫ్రికా జట్టు

దీంతో నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు గులాబీ రంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ జెర్సీతో బరిలోకి దిగిన ప్రతిసారీ డివిలియర్స్ ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపించడం విశేషం. ఇదే పిచ్‌పై గతంలో డివిలియర్స్ గులాబీ జెర్సీ ధరించి ఆడిన 5 మ్యాచ్‌ల్లో 112.5 సగటుతో 450 పరుగులు చేశాడు. ఇందులో ప్రపంచ రికార్డు(31 బంతుల్లో సెంచరీ) సాధించిన ఇన్నింగ్స్ కూడా ఉంది.

 44 బంతుల్లోనే 149 పరుగులు చేసి ప్రపంచ రికార్డు

44 బంతుల్లోనే 149 పరుగులు చేసి ప్రపంచ రికార్డు

2015లో జరిగిన ఆ పింక్‌ వన్డేలో వెస్టిండిస్‌పై రెచ్చిపోయి ఆడిన డివిలియర్స్ 44 బంతుల్లోనే 149 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు 2011 నుంచి దక్షిణాఫ్రికా ఐదు వన్డేల్లో పింక్‌ దుస్తులతో బరిలోకి దిగగా ఐదింటిలోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక చార్లొట్‌ మ్యాక్సికే అకడమిక్‌ హాస్పిటల్‌కు విరాళంగా అందజేస్తారు.

Story first published: Saturday, February 10, 2018, 14:51 [IST]
Other articles published on Feb 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+