న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ తరుపున ఐదో వికెట్ కీపర్: సాహా ఖాతాలో మరో రికార్డు

IND VS BAN,2nd Test :Wriddhiman Saha Joins Elite List Of Indian Wicket-Keepers With 100 Dismissals
Pink Ball Test: Wriddhiman Saha joins elite list of Indian wicket-keepers with a century of dismissals

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే నైట్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా ఎలైట్ జాబితాలో చేరాడు. బంగ్లా ఓపెనర్ షాదమన్‌ ఇస్లామ్‌(29) ఇచ్చిన క్యాచ్‌ను పట్టడం ద్వారా సాహా భారత్ తరుపున వంద డిస్మిల్స్‌ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌కు ముందు 99 డిస్మిల్స్‌‌తో ఉన్న సాహా బంగ్లా బ్యాట్స్‌మన్ షాద్‌మన్‌ క్యాచ్‌ను అందుకోవడం సెంచరీ డిస్మిల్స్ సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరుపున టెస్టుల్లో 100 ఔట్లలో భాగస్వామ్యమై ఈ ఘనత సాధించిన ఐదో భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. సాహా వంద డిస్మిల్స్‌లో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి.

తొలి డే నైట్ టెస్టులో బంగ్లా 106 ఆలౌట్: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాతొలి డే నైట్ టెస్టులో బంగ్లా 106 ఆలౌట్: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌ రెండో బంతిని షాద్‌మన్‌ ఆడగా అది ఎడ్జ్‌ తీసుకుంది. ఈ క్రమంలో ఆఫ్ సైడ్ వెళుతున్న బంతిని సాహా అమాంతం గాల్లోకి ఎగిరి అద్భుతమైన టైమింగ్‌తో అందుకున్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన జాబితాలో ధోని(294) అగ్రస్థానంలో ఉన్నాడు,

ఆ తర్వాత సయ్యద్ కిర్మాణీ(198), కిరణ్‌ మోరే(130), నయాన్‌ మోంగియా(107) వరుసగా ఉన్నారు. అనంతరం ఇషాంత్‌ వేసిన 20 ఓవర్‌ నాలుగో బంతికి మహ్మదుల్లా క్యాచ్‌ను కూడా సాహానే అందుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, తొలి పింక్ బాల్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది.

భారత్‌ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్‌ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. పదునైన బంతులతో వణికించారు. భారత పేసర్ల దెబ్బకు ఇద్దరు బంగ్లా బ్యాట్స్‌మన్‌కు గాయాలు కూడా అయ్యాయి.

తొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మతొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మ

బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఇస్లామ్ చేసిన 29 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. బంగ్లా జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఇద్దరు ఒక్కో పరుగు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్‌ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌కు టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్ల మైలురాయిని అందుకోగా.. భారత్‌లో ఇది రెండోసారి.

Story first published: Friday, November 22, 2019, 18:09 [IST]
Other articles published on Nov 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X