ఓ సూపర్ క్యాచ్: పింక్ బాల్ టెస్ట్‌లో కోహ్లీ ఎలా ఔటయ్యాడో తెలుసా? (వీడియో)

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో విరాట్ కోహ్లీ(194 బంతుల్లో 136; 18 ఫోర్లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
కోహ్లీని కళ్లు చెదిరే క్యాచ్‌తో బంగ్లాదేశ్ ఫీల్డర్ తైజుల్ ఇస్లామ్ పెవిలియన్‌కు చేర్చాడు. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా 81 ఓవర్‌ను ఎబాదత్ వేయగా తొలి బంతిని కోహ్లీ బౌండరీగా మలిచాడు. రెండో బంతిని డిఫెన్స్ ఆడిన కోహ్లీ మూడో బంతిని లెగ్ సైడ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అమాంతం గాల్లోకి ఎగిరిన తైజుల్
అదే సమయంలో ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తైజుల్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్ కోహ్లీని సైతం షాక్‌కు గురి చేసింది. దీంతో చేసేదేమీ లేక కోహ్లీ భారంగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోహ్లీ ఔటైన తర్వాత
కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సిక్సర్, ఫోర్‌తో పది పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ 347/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

347/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి వృద్ధిమాన్ సాహా (17), మహ్మద్ షమి (10) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ హొసైన్, ఇబాదత్ హొసైన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, అబు జాయెద్ రెండు, తైజుల్ ఇస్లాంకు ఒక వికెట్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications