For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pink ball Test: కెప్టెన్‌గా ధోని రికార్డు బద్దలు, బోర్డర్‌ని అధిగమించిన కోహ్లీ

India Vs Bangladesh,Day-Night Test : Virat Kohli Breaks MS Dhoni Record || Oneindia Telugu
Pink ball Test: Virat Kohli breaks MS Dhoni record win 7th successive win as India captain

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు వరుసగా ఇది 7వ టెస్టు విజయం.

ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో నెగ్గిన టీమిండియా... ఆ తర్వాత సఫారీలతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో, ప్రస్తుతం బంగ్లాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ధోని రికార్డు 6 టెస్టు మ్యాచ్‌ల రికార్డుని కోహ్లీ అధిగమించాడు.

ధోని నాయకత్వంలో

ధోని నాయకత్వంలో

ధోని నాయకత్వంలో టీమిండియా 2013(ఫిబ్రవరి-నవంబర్)లో వరుసగా 6 టెస్టు మ్యాచ్‌లు నెగ్గింది. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ అధిగమించాడు. అంతేకాదు టీమిండియాకు సొంతగడ్డపై ఇది 12వ సిరిస్ విజయం కావడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా 10 సిరిస్ విజయాల రికార్డుని టీమిండియా బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

కోహ్లీ మరో అరుదైన రికార్డు

కోహ్లీ మరో అరుదైన రికార్డు

తాజా విజయంతో విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడంతో అత్యధిక టెస్టు విజయాలు సాధించి కెప్టెన్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ రికార్డును కోహ్లీ బద్దలు చేశాడు.

కోహ్లీకిది 33వ టెస్టు విజయం

కోహ్లీకిది 33వ టెస్టు విజయం

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకిది 33వ టెస్టు విజయం. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(53 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌(48 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్‌ వా 41 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్‌ మాజీ సారథి క్లైవ్‌ లాయిడ్‌ 36 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

27వ సెంచరీ

27వ సెంచరీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక డే నైట్‌ టెస్టులో విరాట్ కోహ్లీ(136) టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ.

పింక్‌ బాల్ టెస్టులో సెంచరీ

పింక్‌ బాల్ టెస్టులో సెంచరీ

వన్డేల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 43 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్‌ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

స్మిత్ రికార్డు బద్దలు

స్మిత్ రికార్డు బద్దలు

ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌(26 సెంచరీలు) రికార్డును విరాట్‌ కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌తో కలిసి 17వ స్థానంలో కొనసాగుతున్నాడు.

మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు

ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ ప్రస్తుతం 438 ఇన్నింగ్స్‌ల్లో 70 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 100 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్(668 ఇన్నింగ్స్‌ల్లో 71 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Sunday, November 24, 2019, 16:12 [IST]
Other articles published on Nov 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+