ఫ్యాన్స్‌కు శుభవార్త: డే నైట్ టెస్టు చివరి రెండు రోజుల టికెట్ డబ్బుల వాపస్!

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఐదు రోజులు జరగాల్సిన డే నైట్ టెస్టు మ్యాచ్ మూడు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. మూడో రోజైన ఆదివారం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
నవంబర్ 22న ప్రారంభమైన ఈ పింక్ బాల్ టెస్ట్ ఐదు రోజులు అంటే నవంబర్ 26వరకు జరగాల్సి ఉన్నప్పటికీ... 24వ తేదీనే ముగిసింది. దీంతో చివరి రెండు రోజులు(నవంబర్ 25,26) కోసం టికెట్లు ముందుగానే కొనుగోలు చేసిన అభిమానులకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది.
క్యాబ్ కీలక నిర్ణయం
ఈ మేరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సోమవారం నిర్ణయం తీసుకుంది. వర్షం లేదా మరే ఇతర పరిస్థితుల కారణంగా మ్యాచ్‌లు నిలిచినప్పుడు లేదా రద్దు చేయబడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర బోర్డులు ఈ పద్ధతిని అనుసరిస్తాయి. దీంతో క్యాబ్ కూడా చివరి రెండు రోజుల టికెట్లు తీసుకున్న వారికి తిరిగి డబ్బులు ఇవ్వనుంది.
చివరి రెండు రోజులకు డబ్బులు చెల్లించాలని
చివరి రెండు రోజులకు డబ్బులు చెల్లించాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. కాగా, బంతుల సంఖ్య పరంగా భారతదేశంలో ఆడిన అతి తక్కువ టెస్ట్ ఇదే కావడం విశేషం. 2018లో ఆప్ఘన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు 1028 బంతులు ఆడాయి.
గంగూలీ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆప్ఘన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ రెండు రోజులకే ముగిసింది. అయితే, కోల్‌కతా వేదికగా జరిగిన డే నైట్ టెస్టులో బంగ్లాదేశ్ 161.2 ఓవర్లు ఆడగా... ఆప్ఘనిస్థాన్ మాత్రం 171.2 ఓవర్లు ఆడటం విశేషం. కాగా, భారత్‌లో తొలి డే నైట్ టెస్టు విజయవంతం కావడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు చెలరేగడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications