For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ వయస్సుకు మించి పరిణతి కలిగి ఉంటాడు.. అతని టెక్నిక్‌ అసాధారణం

pietersen praises kl rahul for his consistency and confidence

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36పరుగుల తేడాతో ఓడిపోయి.. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శనను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబైకి ఇది వరుసగా ఎనిమిదో ఓటమి. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్‌ గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఈ సీజన్లో ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. లక్నో విధించిన 169పరుగులను ఛేదించే క్రమంలో ముంబై 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 132పరుగులు మాత్రమే చేయగలిగింది. 36పరుగుల తేడాతో ఓడిపోయింది.

లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 4ఓవర్లలో కేవలం 14పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన మొహ్సిన్ ఖాన్ 1/27తో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చివరి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి 3/19ప్రదర్శనతో ముంబైని దెబ్బతీశాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. కెప్టెన్ రాహుల్ సెంచరీతో మంచి స్కోరు సాధించగలిగింది. అతను 62బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో 103పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును పటిష్ట స్థితికి తెచ్చాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కాంటెండర్స్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తర్వాత రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్ 491పరుగులు చేయగా, రాహుల్‌ 368పరుగులు చేశాడు.

pietersen praises kl rahul for his consistency and confidence

ఈ మ్యాచ్‌లో సెంచరీతో టీ20క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (6) సాధించిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును రాహుల్ సమం చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో తొలి ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 32పరుగులు మాత్రమే చేసింది. కానీ రాహుల్ ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతని ప్రదర్శనపై క్రికెట్ పండితులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రాహుల్‌ను డైనమిక్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. అతను తన వయస్సుకు మించి పరిణతితో ఆడుతున్నాడన్నాడు.

స్టార్ స్పోర్ట్స్‌ 'క్రికెట్ లైవ్'లో పీటర్సన్ మాట్లాడుతూ.. 'రాహుల్ డైనమిక్ ఆటగాడు. అతను తన విజయ పరంపరను ఇంకా చాలా ఏళ్లు కొనసాగించగలడు. వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్నప్పుడు ఇంత కన్సిస్టెన్సీగా పరుగులు చేయడం కష్టమైన విషయం. ముఖ్యంగా కొత్త ఫ్రాంఛైజీలతో ఆడుతున్నప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. వాళ్లు ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు కాబట్టి... దానికి తగ్గ ప్రదర్శన చేయాలనే ఒత్తిడి నెలకొంటుంది.. కానీ రాహుల్ లాంటి పటిష్టమైన టెక్నిక్‌ని కలిగి ఉన్నప్పుడు కొత్త ఫ్రాంచైజీకి ఆడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. వయస్సుకు మించిన పరిణతి కలిగి ఉంటాడు.' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, April 25, 2022, 8:46 [IST]
Other articles published on Apr 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+