హనీమూన్‌పై భజ్జీ: ఆ వీడియో చక్కర్లు, మోడీ దీవెన!
జలంధర్: క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో భజ్జీ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గురువారం తన స్నేహితురాలు గీతా బస్రాను పెళ్లి చేసుకోనున్నాడు. మరో కొత్త ఇన్నింగ్స్ పైన దృష్టి సారించానని భజ్జీ చెప్పారు.
పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం లేదని చెప్పారు. తాను దేవుడిని నమ్ముతానని, ఆయన ఆశీస్సులతోనే నేటి నుంచి తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటికైతే హనీమూన్ ప్రణాళికలు లేవని చెప్పారు. పెళ్లి అనంతరం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బరిలోకి దిగాలన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం సంగీత్‌లో బంధువులతో కలిసి భజ్జీ స్టెప్పులేశాడు. పంజాబీ స్టైల్లో స్టెప్పులేశాడు. ఇది స్వల్ప నిడివితో ఉంది. ఈ వీడియో ఇప్పుడు టీవీలతో పాటు సోషల్ మీడియాలోను చక్కెర్లు కొడుతోంది.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
బుధవారం సాయంత్రం జలంధర్‌కు సమీపంలోని ఓ హోటల్లో జరిగిన వేడుకలో భజ్జీ, అతడి ప్రియురాలు గీత బస్రా ఉంగరాలు మార్చుకున్నారు. గురువారం ఇక్కడే గురుద్వారలో సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
భజ్జీ - గీతాబస్రాల కోసం ప్రముఖ డిజైనర్ అర్చన కొచ్చర్ ప్రత్యేకంగా దుస్తులు రూపొందించింది. పెళ్లి వేడుకలో ఎరుపు, బంగారు రంగుల్లోని సంప్రదాయ దుస్తుల్లో బస్రా.. తెలుపు షేర్వాణీ, తలపాగా, ఎర్రటి ఖడ్గంతో భజ్జీ దర్శనమివ్వబోతున్నారు.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
భజ్జీ తలపాగాలో అమర్చనున్న పింఛాన్ని ప్రత్యేకంగా బరోడా నుంచి తెప్పించారు. దేశవిదేశాలకు చెందిన పాకశాస్త్ర నిపుణులు వంటల తయారీలో పాల్గొంటున్నారు.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
పంజాబ్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుకకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 150 మంది బౌన్సర్లను నియమించారు. అతిథి సత్కారాలకు ఏ లోటూ రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
వాళ్ల బస కోసం దగ్గర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో 200 గదులను తీసుకున్నాడు. సన్నిహితులు, క్రికెటర్లు, బాలీవుడ్ తారలు, ప్రముఖులకు ఆదివారం దిల్లీలో భజ్జీ - బస్రా ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖులు ఈ విందుకు హాజరవుతారని సమాచారం.

భజ్జీ - గీతా బక్రాల వివాహం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కొత్త జంట అయిన భజ్జీ - గీతా బస్రాలను దీవించేందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications