న్యూఢిల్లీ: 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశాన్ని, దేశ ప్రజలకు కంటికి రెప్పలా కాపుడుతున్న సైనికుల సాహసాలపై సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా 'శాల్యూట్ సెల్ఫీ' పేరిట ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ తారలతో పాటు క్రీడాకారులు కూడా 'శాల్యూట్ సెల్ఫీ' పేరిట ట్విట్టర్‌లో చేసిన ట్వీట్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'శాల్యూట్ సెల్ఫీ' పేరిట బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు.
తాజాగా, టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కూడా స్పందించారు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు పొందిన ధోనీ, మిలిటరీ యూనిఫాంలో సైనికులకు శాల్యూట్ చేస్తున్న ఫోటోను తన శాల్యూట్ సెల్ఫీగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.