Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: హానీమూన్‌ని ఎంజాయ్ చేస్తోన్న యువీ, కీచ్

హైదరాబాద్: గత నెలలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్, హాజెల్ కీచ్ దంపతులు ప్రస్తుతం హానీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. పేరు వెల్లడించిన ప్రదేశంలో సముద్ర బీచ్ తీరంలో ఈ జంట హానీమూన్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది.

Pics: It's a beach-side honeymoon for Yuvraj Singh and Hazel Keech

సముద్రపు అలలు, ఇసుకతిన్నెలు, తళతళ మెరిసే ఎండలో విహరిస్తూ ఈ జంట కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానుల కోసం పోస్టు చేసింది. తన ప్రేయసి, బాలీవుడ్ నటి, మోడల్ అయిన హాజెల్ కీచ్‌ను నవంబర్ 30న సిక్కు సాంప్రదాయం, డిసెంబర్ 2న గోవాలో హిందూ సాంప్రదాయంలో యువీ పెళ్లాడిన సంగతి తెలిసిందే.

అంతేకాదు డిసెంబర్ 12న యువరాజ్ 35వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజును తన భాగస్వామితో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.

Pics: It's a beach-side honeymoon for Yuvraj Singh and Hazel Keech

తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. అనంతరం తాజాగా తామిద్దరం హనీమూన్‌ స్వర్గంలో మునిగితేలుతున్నా హజెల్‌ కీచ్‌ ఓ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువీ, హాజెల్ కీచ్‌లు తమ పెళ్లి వేడుకలను సుమారు 10 రోజులు నిర్వహించారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+