రైనా పెళ్లికి మిస్! ముంబైలో కోహ్లీ, అనుష్క చెట్టాపట్టాల్(పిక్చర్స్)
న్యూఢిల్లీ/ముంబై: క్రికెటర్ సురేష్ రైనా వివాహం అతని చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకతో శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, అతని భార్య సాక్షి, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, క్రికెటర్ శిఖర్ ధావన్, రెస్లర్ సుశీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
అయితే, 'స్టార్ కపుల్స్' విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మాత్రం ఈ పెళ్లికి హాజరు అయినట్లుగా కనిపించడం లేదు. రైనా ఎంగేజ్‌మెంట్‌కు వీరు హాజరయ్యారు. అయితే, పెళ్లికి మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. రైనా వివాహం రోజునే వారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.
ఏప్రిల్ 1వ తేదీన జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు కోహ్లీ, అనుష్కలు హాజరయ్యారు. కానీ రైనా పెళ్లి రోజు నాడు మాత్రం ముంబైకి వచ్చారు. రైనా వివాహానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

కోహ్లీ - అనుష్క
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రైనా పెళ్లికి హాజరయినట్లుగా లేదు. రైనా వివాహం రోజునే వారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.

రైనా - ప్రియాంక
ఏప్రిల్ 3వ తేదీన శుక్రవారం నాడు పెళ్లిలో భాగంగా క్రికెటర్ సురేష్ రైనా, అతని చిన్ననాటి మిత్రురాలు ప్రియాంకలు ఇలా..

రైనా - ప్రియాంక
సురేష్ రైనా, ప్రియాంకల పెళ్లి సమయంలో.. రైనాతో భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.

రైనా - ప్రియాంక
సురేష్ రైనా, ప్రియాంకల పెళ్లి సమయంలో.. రైనాతో భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ, డ్వేన్ బ్రావో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications