‘ఇడియట్స్ స్టాప్ దిస్ నాన్‌సెన్స్’: భజ్జీకి కోపమొచ్చిన వేళ(ఫొటో)
చంఢీగర్: చాలా కాలం తర్వాత భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌కి చాలా కోపం వచ్చింది. దీంతో తన ఆగ్రహాన్ని ట్విటర్‌లో ఓ ఫొటోను చూపుతూ వ్యక్తం చేశాడు. 'ఇడియట్స్ స్టాప్ దిస్ నాన్‌సెన్స్' అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
ఓ జాతీయ రహదారిపై చూసిన దృశ్యాన్ని చూసిన హర్భజన్ ఈ మేరకు తీవ్రంగా స్పందించారు. అదేంటంటే.. జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ఓవర్ లోడెడ్ ట్రక్. అది ఓ వైపు కొంచెం వంగి ఇతర వాహనదారులకు భయాందోళనలు కలిగించేలా ప్రమాదకరంగా ఉంది.
దీనిపై హర్భజన్ సింగ్ ట్విట్టర్‌లో తన పలు వ్యాఖ్యలు చేశాడు. ఎంతో ప్రమాదకర రీతిలో ట్రక్కును ఈ విధంగా నడపటం చాలా ఆందోళన కలిగించిందని అన్నాడు. ఇతర వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉన్న ఇలాంటి అర్థంలేని పనులను ఆపండంటూ ట్వీట్ చేశాడు.
కాగా, హర్భజన్ స్పందించిన తీరుకు చాలా మంది నుంచి మద్దతు లభించింది. ఇది ఇలా ఉండగా, బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు హర్భజన్ సింగ్ ఎంపికైన విషయం తెలిసిందే. ఐపిఎల్-8లో మంచి ప్రతిభను చాటుకున్న భజ్జీని మళ్లీ సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications