న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pic Talk: డేవిడ్ వార్నర్‌తో యాంకర్ సుమ, ఫేస్‌బుక్‌లో ఫోటోలు

Pic Talk: When Suma Kanakala fed David Warner

హైదరాబాద్: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఆటగాళ్లంతా జట్లతో కలిసి ప్రాక్టీస్ కూడా షురూ చేశారు. మరికొన్ని జట్లు అభిమానులను ఆకట్టుకునేందుకు గాను యాడ్‌లను కూడా రూపొందిస్తున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఇలాంటి యాడ్‌నే రూపొందించింది. ఇందులో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ యాడ్‌లో బుల్లితెర యాంకర్‌ సుమ కనకాలతో కలిసి సన్‌రైజర్స్ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ సందడి చేశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

 వార్నర్, భువీతో యాంకర్ సుమ

వార్నర్, భువీతో యాంకర్ సుమ

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోల్లో సుమ డేవిడ్ వార్నర్, ఇతర జట్టుసభ్యులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ముఖ్యంగా సుమ, వార్నర్ ఫొటోకు నెటిజన్లు చాలా సరదాగా కామెంట్స్ పెడుతూ, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో వార్నర్‌తో పాటు భువనేశ్వర్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు.

త్వర్లో బుల్లి తెరపై ప్రసారం కానున్న యాడ్

ఈ యాడ్ త్వరలో బుల్లి తెరపై ప్రసారం కానుంది. తెలుగులో సుమ పాపులర్ యాంకర్ కావడంతో ఈ యాడ్ కు ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. మార్చి 28తో వార్నర్‌పై విధించిన నిషేధం పూర్తి కానుంది.

మార్చి 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్ తొలి మ్యాచ్

మార్చి 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్ తొలి మ్యాచ్

దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున వార్నర్‌ మళ్లీ బరిలో దిగనున్నాడు. టోర్నీలో భాగంగా మార్చి 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన మొదటి మ్యాచ్‌‌లో తలపడనుంది. తాజాగా మంగళవారం బీసీసీఐ ఐపీఎల్ గ్రూప్ దశ వరకూ షెడ్యూల్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌

ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. మే 5న గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో మొత్తం 56 మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే.. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ల తేదీలు, వేదికల్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఏదైనా వేదికలో ఏవైనా అనుకోని కారణాల వల్ల మ్యాచ్‌ నిర్వహణ కష్టంగా మారితే ప్రత్యామ్నాయ వేదికగా వైజాగ్‌ను నిర్వాహకులు ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.

Story first published: Wednesday, March 20, 2019, 14:57 [IST]
Other articles published on Mar 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X