Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pic talk: తెలుగు తమ్ముళ్లకు ఆర్సీబీ అంటే ఎంత ప్రేమో: టీడీపీ మహానాడు బ్యానర్‌లో విరాట్ కోహ్లీ

Pic Talk: Royal Challengers Bangalore banner appeared in TDPs Mahanadu

అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫైనల్స్‌కు కూడా ఇదే వేదిక. ఇదే పిచ్‌పై ఫైనల్స్ ఆదివారం రాత్రి 8 గంటలకు షెడ్యూల్ అయింది. గుజరాత్ టైటాన్స్ ఇదివరకే ఫైనల్స్‌కు చేరుకోగా.. దాన్ని ఢీ కొట్టేదెవరనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది. రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది.

బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్..

బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్..

ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్, ఫైనల్స్ నిర్వహించనుంది బీసీసీఐ. వన్డే ఇంటర్నేషనల్స్‌, టీ20లకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి- టీ20 మ్యాచ్‌ల కోసం దీన్ని రూపొందించారు. తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 174 పరుగులు కావడం దీనికి నిదర్శనం. రెండో ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 166. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్టు 200లకు పైగా స్కోర్‌ను సాధించే అవకాశాలు లేకపోలేదు.

పించ్ హిట్టర్ల జోరు..

పించ్ హిట్టర్ల జోరు..

జోస్ బట్లర్, సంజు శాంసన్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి బ్యాటర్ల నుంచి భారీ షాట్లను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాగా- మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ రెండు జట్ల మధ్య కాస్త వాతావరణం వేడెక్కింది. రాజస్థాన్ రాయల్స్ కవ్వింపు ట్వీట్లు దీనికి కారణం అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను రెచ్చగొట్టేలా రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ పేజ్ అడ్మిన్ ట్వీట్ చేయడం వార్‌కు తెర తీసింది.

మహానాడులో వెలిసిన బ్యానర్..

మహానాడులో వెలిసిన బ్యానర్..

అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుందీ టీడీపీ. మూడేళ్లుగా దీన్ని నిర్వహించలేదు. ఈ సారి ఒంగోలులో ఇవ్వాళ ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు- పార్టీ జెండాను ఆవిష్కరించి.. దీన్ని ప్రారంభించారు. ఎల్లుండి ఈ కార్యక్రమం ముగుస్తుంది.

టీడీపీ-ఆర్సీబీ మ్యూచువల్ ఫ్యాన్స్..

టీడీపీ-ఆర్సీబీ మ్యూచువల్ ఫ్యాన్స్..

కాగా- మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చే నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ ప్రకాశం, బాపట్ల జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. ఈ బ్యానర్లల్లో కొన్నింట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ వెలిశాడు. అతని ఫొటోను ముద్రించారు అభిమానులు. టీడీపీ-రాయల్ ఛాలెంజర్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ బ్యానర్లను కట్టారు. బాపట్ల జిల్లా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మక్కెనవారి పాలెం తెలుగు యువత నాయకులు కట్టిన ఓ బ్యానర్‌లో విరాట్ కోహ్లీ దర్శనం ఇచ్చాడు.

ఆర్సీబీ విజయం కోసం..

ఆర్సీబీ విజయం కోసం..

ఆర్సీబీ విజయం కాంక్షిస్తూ..అంటూ దాని పక్కన విరాట్ కోహ్లీ ఫొటోను ప్రింట్ చేయించారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావుతోపాటు బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఫొటోలు ఇందులో ప్రముఖంగా కనిపించేలా ముద్రించారు. దీనితో పాటు చంద్రబాబు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తోన్న ఫొటోను మార్ఫింగ్ చేశారు. కోహ్లీ ముఖానికి బదులుగా చంద్రబాబు ఫేస్‌ను అతికించి మరీ- ఆర్సీబీకి విషెస్ చెప్పారు.

Story first published: Friday, May 27, 2022, 17:10 [IST]
Other articles published on May 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+