కన్నుల పండుగగా బీసీసీఐ అవార్డులు: మెరిసిన కోహ్లీ, అశ్విన్
హైదరాబాద్: బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాలీ ఉమ్రిగర్ అవార్డును, స్పిన్నర్ అశ్విన్ 'దిలీప్ సర్దేశాయ్' అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది.
ఇక కల్నల్ సీకే నాయుడు అవార్డును స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వీకరించాడు. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్‌కు 'బెస్ట్ ఉమన్ క్రికెటర్' అవార్డు దక్కింది. రాజిందర్ గోయెల్, పద్మాకర్ శివాల్కర్‌లకు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కగా, శాంత రంగస్వామికి మహిళల కేటగిరీలో బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.
ఇక టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసాన్ని భారత మాజీ వికెట్‌కీపర్ ఫారుఖ్ ఇంజినీర్ వెలువరించారు. బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకకు సంబంధించిన ఫోటోలు మీకోసం:

బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకకు హాజరైన టీమిండియా
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక బుధవారం కన్నుల పండుగగా జరిగింది. బెంగుళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి క్రీడా ప్రముఖలందరూ హాజరయ్యారు. వీరితో పాటు టీమిండియా, అవార్జు విజేతలు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. Image Courtesy: BCCI

పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న కెప్టెన్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 2015-16 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది.

అవార్డు అందుకున్న తర్వాత కోహ్లీ
బెంగుళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్ వేదికగా మార్చి 8 (బుధవారం) జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక కార్యక్రమంలో మాట్లాడుతున్న కోహ్లీ.

దిలీప్ సర్దేశాయ్ అవార్డుని అందుకున్న అశ్విన్
బెంగుళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్ వేదికగా మార్చి 8 (బుధవారం) జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అశ్విన్ ‘దిలీప్ సర్దేశాయ్' అవార్డును అందుకున్నారు.

అవార్డు అందుకున్న తర్వాత అశ్విన్
బెంగుళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్ వేదికగా మార్చి 8 (బుధవారం) జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో ‘దిలీప్ సర్దేశాయ్' అవార్డును అందుకున్న తర్వాత మాట్లాడుతున్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అశ్విన్.

లాలా అమర్‌నాథ్ అవార్డు అందుకున్న అక్షర పటేల్
దేశవాళీ వన్డేల్లో బెస్ట్ ఆల్‌రౌండర్‌కు లాలా అమర్‌నాథ్ అవార్డు అవార్డుని ఇస్తారు. 2016-17 సంవత్సరానికి గాను గుజరాత్‌కు చెందిన అక్షర్ పటేల్‌కు ఈ అవార్డు దక్కింది.

ఎంసీఏ తరుపున అవార్డు అందుకున్న రహానే
బీసీసీఐ దేశవాళీ టోర్నీలను నిర్వహించినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు అవార్డు లభించింది. ఈ అవార్డుని ఎంసీఏ తరుపున టీమిండియా ఆటగాడు రహానే అవార్డు అందుకున్నాడు.

మాధవరావు సింధియా అవార్డుని అందుకున్న శ్రేయస్ అయ్యర్
రంజీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఇచ్చే మాధవరావు సింధియా అవార్డుని 2016-17 సీజన్‌కు గాను ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications