గోవాలో యువీ పెళ్లి: స్పెషల్ ఎట్రాక్షన్‌గా కోహ్లీ-అనుష్క
హైదరాబాద్: డిసెంబర్ 2(శుక్రవారం)న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, నటి మోడల్ హాజెల్ కీచ్‌ల వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి యువీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
గోవాలో యువరాజ్- హాజెల్ కీచ్‌ల పెళ్లి ఫోటోలు
కాగా, గోవాలో ఆడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో హాజరయ్యాడు. ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దంపతులతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు.
యువీతో కలిసి దిగిన ఫోటోలను రోహిత్ శర్మ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. సిక్కు సంప్రదాయ పద్ధతిలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌ల వివాహం నవంబర్ 30వ తేదీన చండీగఢ్‌లోని ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో వైభవంగా జరిగింది.
గోవాలో యువరాజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మీ కోసం:
నూతన దంపతులతో కోహ్లీ-అనుష్క జంట
యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల గోవా పెళ్లికి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి హాజరయ్యారు.
కీచ్‌తో యువరాజ్
పెళ్లి తంతులో భాగంగా హాజెల్ కీచ్ ఏదో చెబుతుండగా కళ్లు అప్పగించి చూస్తున్న యువరాజ్.
బైక్‌పై యువరాజ్
పెళ్లి తంతులో భాగంగా బైక్‌పై వచ్చిన యువరాజ్ సింగ్.
చిన్నారితో కీచ్
పెళ్లిలో భాగంగా ఓ చిన్నారితో కలిసి పెళ్లి మండపానికి వస్తున్న హాజెల్ కీచ్.
కీచ్‌తో యువీ డ్యాన్స్
పెళ్లి అనంతరం హాజెల్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న యువరాజ్ సింగ్.
యువీ పెళ్లికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు
గోవాలో యువీ పెళ్లికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు పలువురు హాజరయ్యారు.
గోవా ఎయిర్ పోర్టులో కోహ్లీ-అనుష్క
గోవా విమానాశ్రయంలో బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్‌తో ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ
పెళ్లి కొడుకు యువీతో రోహిత్ శర్మ దంపతులు
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన యువరాజ్-హాజెల్ కీచ్ వివాహానికి రోహిత్ శర్మ దంపతులు హాజరయ్యారు.
గోవా విమానాశ్రయంలో కోహ్లీ-అనుష్క శర్మ
యువరాజ్-హాజెల్ కీచ్ వివాహానికి హాజరయ్యేందుకు గోవాకు వచ్చిన అనుష్క శర్మ, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications