Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3వ కెప్టెన్‌గా కోహ్లీ: బంగ్లాపై భారత్ విజయం సాధించిందిలా?

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్‌ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో కోహ్లీ కెప్టెన్సీలో సొంతగడ్డపై టీమిండియాకు ఇది నాలుగో సిరిస్ విజయం కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన భారత తొలి కెప్టెన్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ టెస్టు విజయంతో అజహరుద్దీన్ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన కోహ్లీ ఖాతాలో ఇది 15వ విజయం కాగా దీంతో అత్యధిక విజయాలు సాధించిన 3వ కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.

భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో నాలుగు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీసుకున్నాడు. ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన కోహ్లీ వరుసగా శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టిండీస్‌పై 2-0, న్యూజిలాండ్‌పై 3-0, ఇంగ్లండ్‌పై 4-0 తేడాతో సిరీస్‌లు చేజిక్కించుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లోనూ గెలుపొంది వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

మహ్మదుల్లా వికెట్ తీసిన ఆనందంలో ఇషాంత్ శర్మ

మహ్మదుల్లా వికెట్ తీసిన ఆనందంలో ఇషాంత్ శర్మ

ఉప్పల్ స్టేడియంలో బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాహుల్.

ఆనందంలో ఇషాంత్ పైకి ఎక్కిన ఓపెనర్ కేఎల్ రాహుల్

ఆనందంలో ఇషాంత్ పైకి ఎక్కిన ఓపెనర్ కేఎల్ రాహుల్

ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా వికెట్ తీసిన అనంతరం ఇషాంత్ పైకి ఎక్కిన ఓపెనర్ కేఎల్ రాహుల్.

కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన అశ్విన్

కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన అశ్విన్

ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆఖరి రోజైన సోమవారం బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన అశ్విన్. అనంతరం అశ్విన్‌ను అభినందిస్తున్న టీమిండియా ఆటగాళ్లు.

గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చిన టీమిండియా

గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చిన టీమిండియా

ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ అనంతరం సపోర్టింగ్ స్టాప్‌తో కలిసి గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.

ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకులకు కెప్టెన్ కోహ్లీ అభివాదం

ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకులకు కెప్టెన్ కోహ్లీ అభివాదం

459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్‌ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా విజయానంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న కెప్టెన్ కోహ్లీ.

విన్నింగ్ ట్రోఫీతో కెప్టెన్ కోహ్లీ

విన్నింగ్ ట్రోఫీతో కెప్టెన్ కోహ్లీ

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 240 బంతుల్లో కోహ్లీ 204 పరుగుల చేశాడు. ఇందులో 24 ఫోర్లున్నాయి.

విన్నర్స్ టీమిండియా

విన్నర్స్ టీమిండియా

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై 208 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం ట్రోఫీతో ఫోటోకు ఫోజిలిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+