2016 టాస్ స్కోరర్లు వీరే: రెండో స్థానంలో కోహ్లీ
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత రన్ మెషిన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీకి, ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌ల మధ్య రన్ వార్ జరుగుతోంది. 2016లో వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు.
ఈ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జో రూట్ 2,207 పరుగులు చేయగా, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2,196 పరుగులు సాధించాడు. వీరిద్దరి మధ్య ఈ ఏడాది గట్టి పోటీ నెలకొంది. అంతేకాదు ఈ ఏడాది 2000 పరుగుల మార్కుని అందుకున్న బ్యాట్స్‌మెన్లు వీరిద్దరే కావడం విశేషం.
2016లో మొత్తంగా చూస్తే 21 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కుని అందుకున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత 1000 పరుగుల మార్కుని అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా అజ్యింకే రహానే నిలిచాడు. 2016లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే:

జో రూట్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ 2016లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మొదటి స్ధానంలో ఉన్నాడు. 39 అంతర్జాతీయ గేమ్స్ ఆడిన జో రూట్ 51.32 యావరేజితో 2,207 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 254.

విరాట్ కోహ్లీ (భారత్)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 34 అంతర్జాతీయ గేమ్స్ ఆడిన (రూట్ కంటే 4 తక్కువ) కోహ్లీ 84.46 యావరేజితో 2,196 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది రెండు డబుల్ సెంచరీలు సాధించాడు.

3. డేవిడే వార్నర్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఓపెనర్ 34 అంతర్జాతీయ గేమ్స్ ఆడి 43.54 యావరేజితో 1,829 పరుగులు సాధించాడు. ఈ ఏడాది డేవిడ్ వార్నర్ అత్యధిక స్కోరు 173.

4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 39 అంతర్జాతీయ గేమ్స్ ఆడి 45.07 యావరేజితో 1,713 పరుగులు సాధించాడు. ఈ ఏడాది స్టీవ్ స్మిత్ అత్యధిక స్కోరు 149.

5. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా)
దక్షిణాఫ్రికాకు చెందిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది 30 అంతర్జాతీయ గేమ్స్ ఆడి 56.75 యావరేజితో 1,646 పరుగులు సాధించాడు. ఈ ఏడాది క్వింటన్ డికాక్ అత్యధిక స్కోరు 178.

6. కేన్ విలిమ్సన్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలిమ్సన్ 31 అంతర్జాతీయ గేమ్స్ ఆడి 44.72 యావరేజితో 1,476 పరుగులు సాధించాడు. అయితే ఇటీవల భారత్‌తో జరిగిన సిరిస్‌లో విలియమ్సన్ విఫలం కావడం అతని పరుగులు తక్కువ చేయడానికి కారణం.

7. దినేశ్ ఛండీమాల్ (శ్రీలంక)
శ్రీలంకకు చెందిన ఈ వికెట్ కీపర్ ఆ దేశ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నారు. 36 అంతర్జాతీయ గేమ్స్ ఆడిన దినేశ్ ఛండీమాల్ 38.18 యావరేజితో 1,451 పరుగులు సాధించాడు.

8. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా)
దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ బ్యాట్స్ మెన్లలో హషీం ఆమ్లా ఒకడు. ఈ ఏడాది 28 అంతర్జాతీయ గేమ్స్ ఆడిన హషీం ఆమ్లా 51.07 యావరేజితో 1,430 పరుగులు సాధించాడు. ఈ ఏడాది హషీం ఆమ్లా అత్యధిక స్కోరు 201.

9. అలెక్స్ హాల్స్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది 32 అంతర్జాతీయ గేమ్స్ ఆడి 1,426 పరుగులు సాధించాడు. ఈ ఏడాది అలెక్స్ హాల్స్ అత్యధిక స్కోరు 171.

10. జానీ బెయిర్ స్టో (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్ జట్టు వికెట్ కీపర్‌గా ఉన్న జానీ బెయిర్ స్టో 25 అంతర్జాతీయ గేమ్స్ ఆడి 54.48 యావరేజితో 1,362 పరుగులు సాధించాడు. ప్రస్తుతం జానీ బెయిర్ స్టో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో హాల్స్ తర్వాత రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications