రోహిత్ గ్రేట్ రికార్డ్స్, నా పిల్లలకి చెప్తానని కోహ్లీ(పిక్చర్స్)
కోల్‌కతా: రోహిత్ శర్మ సంచలన ఇన్నింగ్స్‌తో దుమ్ము రేపడంతో శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. రోహిత్ (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264) ప్రపంచ రికార్డు డబుల్ సెంచరీ సాధించడంతో నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ సేన 153 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టి కరపించింది.
దీంతో సిరీస్‌లో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈడెన్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ ద్విశతకంతో పాటు కోహ్లీ (64 బంతుల్లో 6 ఫోర్లు 66) అర్ధ సెంచరీతో మెరవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 43.1 ఓవర్లలో 251 రన్స్‌కే ఆలౌటైంది.

క్రికెట్
భారత ఓపెనర్ రోహిత్ శర్మ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన నాలుగో వన్‌డేలో రెచ్చిపోయాడు. 264 పరుగులు సాధించడం ద్వారా వన్‌డేల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

క్రికెట్
ఇప్పటి వరకూ వన్డేల ఫార్మెట్‌లో నాలుగు డబుల్ సెంచరీలు నమోదు కాగా, అందులో రెండు కూడా రోహిత్ శర్మవే కావడం గమనార్హం.

క్రికెట్
శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం జరిగిన నాలుగో వన్‌డేలో రోహిత్ చెలరేగడంతో భారత్ 404 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం లంకను 251 పరుగులకు అలౌట్ చేసి, వరుసగా నాలుగోసారి విజయభేరి మోగించింది. సిరీస్‌పై 4-0 ఆధిక్యాన్ని సంపాదించి, క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.

క్రికెట్
ఓపెనర్ రోహిత్ శర్మ సంచలన ఇన్నింగ్స్‌తో దుమ్ము రేపడంతో శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.

క్రికెట్
భారత బౌలర్ స్ట్రాట్ బిన్నీ శ్రీలంక బ్యాట్స్‌మన్ చండిమాను ఔట్ చేసిన ఆనందంలో ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్న సహచరులు.

క్రికెట్
173 బంతుల్లో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. వన్డేల్లో సెహ్వాగ్ (219) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును తుడిచి పెట్టాడు.

రోహిత్ శర్మకు జయవర్ధనే అభినందన
ఒక మ్యాచులో అత్యధిక ఫోర్లు కొట్టిన సెహ్వాగ్, సచిన్ (25) రికార్డును దాటేశాడు. బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు సాధించిన వాట్సన్ (150)ను వెనక్కి నెట్టాడు. రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్స్‌లు కొట్టాడు.

క్రికెట్
173 బంతుల్లో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. వన్డేల్లో సెహ్వాగ్ (219) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును తుడిచి పెట్టాడు.

క్రికెట్
ఒక మ్యాచులో అత్యధిక ఫోర్లు కొట్టిన సెహ్వాగ్, సచిన్ (25) రికార్డును దాటేశాడు. బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు సాధించిన వాట్సన్ (150)ను వెనక్కి నెట్టాడు. రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్స్‌లు కొట్టాడు. కాగా, విరాట్ కోహ్లీ 50 రన్స్ చేసిన సందర్భంగా అభివాదం.

క్రికెట్
ఒక మ్యాచులో అత్యధిక ఫోర్లు కొట్టిన సెహ్వాగ్, సచిన్ (25) రికార్డును దాటేశాడు. బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు సాధించిన వాట్సన్ (150)ను వెనక్కి నెట్టాడు. రోహిత్ 33 ఫోర్లు, 9 సిక్స్‌లు కొట్టాడు.

క్రికెట్
ఈడెన్‌లో 50 ఓవర్లూ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. తొలి 10-15 ఓవర్లు బ్యాటింగ్ కష్టమైంది. అయితే క్రీజులో కుదురుకునేందుకు రహానె సహకరించాడు. ఏదేమైనా అజేయంగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఈడెన్‌లో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఫస్ట్‌క్లాస్, టెస్ట్ అరంగేట్రం, ఐపీఎల్ శతకం ఇక్కడే చేశా. ఇది స్పెషల్ ఇన్నింగ్స్. భవిష్యత్‌లో ట్రిపుల్ సెంచరీ కోసం ప్రయత్నిస్తా. ఈ మ్యాచ్‌లో నా తప్పిదంతోనే కోహ్లీ అవుటయ్యాడు. అప్పుడప్పుడూ ఇలాంటి పొరపాట్లు సహజమే. అందుకే ఆటపై దృష్టిపెట్టా. ఇక కెరీర్‌లో ఒకటి, రెండు వైఫల్యాలు నన్ను ఆపలేవు. కఠోర శ్రమే నన్ను ముందుకు నడిపిస్తుంది. - రోహిత్ శర్మ

క్రికెట్
రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పైన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్ అత్యధిక పరుగుల రికార్డు నమోదు చేసిన మ్యాచులో తాను కూడా ఆడానని తన పిల్లలకు చెబుతానని వ్యాఖ్యానించాడు.
72 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్. మరో 28 బంతుల్లో సెంచరీ చేయగా తర్వాత 51 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. శర్మకు (4, 201, 222) మొత్తం మూడు లైఫ్‌లు లభించాయి. తొలుత ఐదో ఓవర్‌లో సులువైన క్యాచ్‌ను పెరీర వదిలేశాడు. దీనికి లంక భారీ మూల్యమే చెల్లించుకుంది.
రహానె (28), రాయుడు (8) అవుటైన తర్వాత రోహిత్‌తో కెప్టెన్ కోహ్లీ జతకట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 202 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 32వ ఓవర్‌లో సింగిల్‌తో కెరీర్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. శతకం తర్వాత సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కోహ్లీ అవుటైనా.. ఊతప్పతో ఐదో వికెట్‌కు 128 రన్స్ జోడించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ, అత్యధిక స్కోరు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications