సెహ్వాగ్, ధోని, గంగూలీ యువీ ఢిల్లీ మారథాన్ రిసెప్షన్
హైదరాబాద్: ఢిల్లీలోని ఓ హోటల్‌లో బుధవారం (డిసెంబర్ 7)నాడు టీమిండియా ఆల్ రౌండర్ యవరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌ల గ్రాండ్ రిసెప్షన్‌కు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు పలువురు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
మూడు ముళ్ల బంధంతో యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్‌లు ఒక్కటయ్యారు. నవంబర్ 30వ తేదీన చంఢీగడ్‌లో సిక్కు సంప్రదాయ ప్రకారం, డిసెంబర్ 2న గోవాలో హిందు సంప్రదాయ ప్రకారం జరిగిన వీరి పెళ్లికి ధోని హాజరు కాని విషయం తెలిసిందే.
అయితే తాజాగా బుధవారం బుధవారం ఢిల్లీలోని హోటల్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్ కార్యక్రమానికి ధోని తన భార్య సాక్షితో కలిసి వచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తితో కలిసి వచ్చారు.
యువీ, హాజెల్ కీచ్‌లు తమ పెళ్లి వేడుకలను సుమారు 10 రోజులు నిర్వహించేలా ముందుగానే ఓ ప్రణాళిక వేసుకున్నారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్‌లు కూడా ఈ రిసెప్షన్‌కు హాజరైన వారిలో ఉన్నారు.
హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, శిఖర్ ధావన్‌తో కొత్త పెళ్లికొడుకు యువరాజ్ సింగ్ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా గడిపాడు. అలాగే భజ్జీ ట్విట్టర్ ద్వారా మరోసారి యువరాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ యువరాజ్ సంగీత్ వేడుకల్లో సరదాగా ఎంజాయ్ చేసినట్లు ట్విట్టర్‌లో ఫోటోలతో సహా ట్వీట్ చేశాడు.

మహేంద్ర సింగ్ ధోని
ఢిల్లీలో యువరాజ్ సింగ్ రిసెప్షన్‌కు వస్తున్న టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. తన భార్యతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ధోని భార్య సాక్షి
ఢిల్లీలో యువరాజ్ సింగ్ రిసెప్షన్‌కు వస్తున్న టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన భార్యతో కలిసి వచ్చారు.

యువీతో సెహ్వాగ్
తన భార్య ఆర్తీతో కలిసి యువరాజ్ రిసెప్షన్‌కు హాజరైన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

సౌరభ్ గంగూలీ
యువరాజ్ రిసెప్షన్‌కు హాజరైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ .

యువీ రిసెస్షన్‌కు భార్య గీతా బాస్రాతో భజ్జీ
టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మారథాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు భార్య గీతా బాస్రాతో కలిసి హాజరైన భజ్జీ.
యవీ రిసెప్షన్‌లో భజ్జీ, ధోని, కైఫ్
టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మారథాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు భార్య గీతా బాస్రాతో కలిసి హాజరైన భజ్జీ.

సహారా సుబ్రతా రాయ్
టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మారథాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సహారా ఛీప్ సుబ్రతా రాయ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications