Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనితో సెల్ఫీలు: మిత్రులకు విలాసవంతమైన విందు (ఫోటోలు)

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీ స్కిల్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు.

ట్రోఫీలో భాగంగా గత అదివారం (ఫిబ్రవరి 26)న ఛత్తీస్ గడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం ధోని చెలరేగి ఆడాడు. 107 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 129 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. మ్యాచ్ అనంతరం ధోని తన పాత స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశాడు.

స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ధోని

స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ధోని

ఇటీవలే ఐపీఎల్‌లో రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాక మరింత సమయం దొరికింది. మ్యాచ్ అనంతరం తాను రైల్వే టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో స్నేహితులు, తన రూమ్మేట్‌, ఖరగ్‌పూర్‌లో తనకు పాలు అందించే టీస్టాల్‌ యజమానితో కలిసి భోజనం చేశాడు. చిన్న టీ స్టాల్‌ను నడుపుకునే థామస్ అనే వ్యక్తితో గతంలో తనకు పరిచయాన్ని ధోని మరిచిపోలేదు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ బయట ఓ చిన్న టీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు.

కోల్‌కతాతో సుదీర్ఘ అనుబంధం

కోల్‌కతాతో సుదీర్ఘ అనుబంధం

దాదాపు పదమూడేళ్ల క్రితం ధోనీ జూనియర్ టీటీగా పని చేస్తున్న సమయంలో కనీసం మూడుసార్లు ఆ టీ స్టాల్ దగ్గరకు వెళ్లేవాడట. ఆ క్రమంలోనే వారి మధ్య స్నేహం కూడా ఏర్పడింది. కాల గమనంలో సంవత్సరాలు గడిచిపోయాయి కూడా. తన దగ్గర టీ తాగిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాడని థామస్ అనుకోవడం తప్ప ఏనాడు అతన్ని కలిసే అవకాశం రాలేదు. అయితే విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా కోల్ కతాకు ధోని వచ్చాడని తెలుసుకుని ఈడెన్ గార్డెన్ స్టేడియానికి చేరుకుని అతి కష్టం మీద డ్రెస్సింగ్ రూం వరకు వెళ్లాడు. దీంతో థామస్‌ను చూసిన ధోని, అమాంతం పరుగెత్తుకుంటూ వెళ్లి అతడ్ని గట్టిగా వాటేసుకున్నాడు.

ధోని తన భార్య సాక్షిని కలిసిందీ కోల్‌కతాలోనే

ధోని తన భార్య సాక్షిని కలిసిందీ కోల్‌కతాలోనే

నిజం చెప్పాలంటే ధోనికి కోల్‌కతాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందు ఖరగ్ పూర్ స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. రైల్వేస్‌తో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ప్రస్థానం ఆరంభించిన ధోనీ కోల్‌కతాలోనే జూనియర్‌ క్రికెట్‌ ఆడాడు. రంజీలో 2001లో బిహార్‌ తరఫున తొలి సెంచరీని (114 నాటౌట్‌) కూడా ఇక్కడే చేశాడు. అంతేకాదు ధోని భార్య సాక్షిని కలిసిందీ కోల్‌కతాలోనే కావడం విశేషం. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనికి ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. రైల్వే ప్లేయర్ నుంచి టీమిండియాకు ఆడే వరకు ధోని ఓ క్రికెటర్‌గా ఎదగడాన్ని సత్యప్రకాశ్ సింగ్ అనే స్నేహితుడు దగ్గరుండి చూశాడు.

మిత్రులతో కలిసి భోజనం

మిత్రులతో కలిసి భోజనం

ఇక ఖరగ్‌పూర్‌‌లోని ఛాయ్ వాలా థామస్‌ను చూసిన వెంటనే గుర్తు పట్టిన ధోని అతడితో కలిసి కాసేపు ముచ్చటించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం థామస్ తో కాసేపు సరదాగా గడిపిన ధోని.. అతన్ని హోటల్‌కు తీసుకెళ్లి తనతో పాటు 11 మంది మిత్రులను జార్ఖండ్ జట్టు బస చేసిన హోటల్‌కు పిలిపించుకుని వారితో కలిసి భోజనం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+