ఫోటోలు: 2016 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే
హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వార్షిక అవార్డులను మంగళవారం ప్రకటించింది. టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా అశ్విన్ గెలుచుకోవడం విశేషం.
ఈ ఏడాదికి ఐసీసీ అత్యుత్తమ టెస్టు, వన్డే జట్టులను కూడా ప్రకటించింది. 12 మంది జట్టు సభ్యులతో కూడిన టెస్టు జట్టులో భారత్ నుంచి అశ్విన్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. ఇక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఎంపికవ్వగా, వన్డే జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.
కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టెన్, కుమార సంగక్కర ఈ జట్లను ఎంపిక చేశారు. 2015 సెప్టెంబర్ 14 నుంచి 2016 సెప్టెంబర్ 20వ తేదీ వరకు క్రికెటర్లు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ జట్లను ఎంపిక చేశారు.
ఈ ఏడాది ఐసీసీ అవార్డుల జాబితా ఇదే:

రవిచంద్రన్ అశ్విన్
టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను 2016 సంవత్సరానికి గాను సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ట్రోఫీని టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్
ఈ ఏడాది టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఒకే ఏడాదిలో రెండు అవార్డులను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు.

వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా డీకాక్
దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ డీకాక్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

మిస్బా ఉల్ హక్
2016 సంవత్సరానికి గాను ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ సొంతం చేసుకున్నాడు. పాకిస్ధాన్ తరుపున ఈ అవార్డుని సొంతం చేసుకున్న మొట్టమొదటి క్రికెటర్ మిస్బా ఉల్ హక్ కావడం విశేషం.

ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
ఆప్ఘనిస్ధాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మొహమ్మద్ షహ్జాద్ ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

ఐసీసీ టీ20 ఫెర్మామ్మెన్స్ ఆఫ్ ద ఇయర్
వెస్టిండిస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్ ఐసీసీ టీ20 ఫెర్మామ్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో భారత్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 ఫైనల్ మ్యాచ్‌లో 10 బంతుల్లో 34 పరుగులు చేసి వెస్టిండిస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 సంవత్సరానికి ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ ఎంపిక చేసిన వన్డే జట్టులో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది.

ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్
ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో భారత్ తరుపు నుంచి టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఎంపికయ్యాడు. కుక్‌తో టెస్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌గా ఎంపికయ్యాడు. కీపర్‌గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12వ ఆటగాడిగా ఐసీసీ ఎంపిక చేసింది.

ఐసీసీ వన్డే ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ఐసీసీ వన్డే ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకుంది. దీంతో పాటు ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సైతం కైవసం చేసుకుంది.

ఐసీసీ ఎమర్జెంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
బంగ్లాదేశ్‌కు చెందిన యువ పేసర్ ముస్తాఫిర్ రెహ్మాన్ ఐసీసీ ఎమర్జెంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ అంఫైర్ ఆఫ్ ద ఇయర్
దక్షిణాఫ్రికాకు చెందిన అంఫైర్ మారిస్ ఎరాసమస్ ఐసీసీ అంఫైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాడు. మాజీ అంఫైర్ డేవిడ్ షెఫ్పర్డ్ ట్రోపీని అంఫైర్‌కు అందజేస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications