ఫోటోలు: బోల్ట్, బైల్స్‌కు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఉసేన్ బోల్ట్, సిమోన్ బైల్స్‌లకు క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు లభించాయి. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం ఫిబ్రవరి 14 (బుధవారం)న మొనాకోలో నిర్వహించారు.
'ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్'గా ఈ అవార్డును పోల్చుతారు. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్ఫింటర్ అయిన ఉసేన్ బోల్ట్ ఈ అవార్డుని నాలుగో సారి అందుకున్నాడు. తద్వారా గతంలో నాలుగు సార్లు ఈ అవార్డుని అందుకున్న రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్, కెల్లీ స్లాటర్ జాబితాలో చేరాడు.

స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్‌గా ఉసేన్ బోల్ట్
2009, 2010, 2013లో బోల్ట్ ఈ అవార్డును అందుకున్నాడు. దీంతో పాటు ఉసేన్ బోల్ట్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్‌గా, ఆస్ట్రేలియా జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి సిమోన్ బైల్స్ స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకున్నారు.
రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకే
గతేడాది రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను వీరిద్దరూ ఈ అవార్డుకు ఎంపిక్యయ్యారు. లెజెండరీ అథ్లెట్ మిచెల్ జాన్సన్ చేతులమీదుగా బోల్ట్ ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం ఉసేన్ బోల్ట్ మీడియాతో మాట్లాడాడు.

ఆనందంగా ఉందన్న బోల్ట్
ఈ అవార్డు ఎంతో ప్రత్యేకమైందని, తాను దీన్ని అందుకోవడం ఇది నాలుగోసారని, రోజర్ ఫెదరర్ సరసన నిలవడం ఎంతో ఆనందంగా ఉందని బోల్ట్ అన్నాడు. అనంతరం స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రిన్స్ ఆల్బర్ట్, నదియా చేతులమీదుగా బైల్స్ అందుకున్నారు.

లారెస్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు చికాగో కబ్స్
ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన బేస్ బాల్ జట్టు చికాగో కబ్స్... లారెస్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఇపీఎల్)లో అద్భుత ప్రదర్శన చేసిన లీసెస్టర్ సిటీ జట్టు ప్రత్యేకంగా లారెస్ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ అవార్డుని గెలుచుకుంది.

మిచెల్ ఫెల్ఫ్స్‌కు ‘కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
‘కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్' అవార్డును అమెరికాకు చెందిన మిచెల్ ఫెల్ఫ్స్ అందుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను ఫెల్ఫ్స్‌కి ఈ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications