మన బౌలర్లను ఉతికేశారు: తొలిసారి ముగ్గురి శతకాలు, భారత్‌కు భారీ లక్ష్యం
రాజ్‌కోట్: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టు మ్యాచులోనే టీమిండియా బౌలర్లను ఉతికి ఆరేసింది. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్లు సెంచరీలు నమోదు చేశారంటూ వాళ్ల ఆట ఎలాగుందే చెప్పేయెచ్చు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరును భారత్‌కు నిర్దేశించింది.

షాట్ కొడుతున్న జో రూట్
భారత్‌తో జరుగుతున్న మొదటిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 159.3 ఓవర్లలో 537 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. తొలి రోజు లభించిన అద్భుత ఆరంభాన్ని ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్ కొనసాగించడంతో భారీ స్కోర్ సాధించగలిగింది.

మైకేల్ క్లార్క్ తర్వాత భారత్‌లో రూట్‌దే తొలి సెంచరీ
మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ (128) శతకం సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తోడు రూట్(124), అలీ(117) శతకాలు సాధించి ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించేందుకు బాటలు వేశారు. బెయిర్‌స్టో(46), అన్సారీ(32) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా ఉమేష్, షమీ, అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు. అమిత్ మిశ్రాకు ఓ వికెట్ దక్కింది.

మొయిన్ అలీ తన నాల్గవ సెంచరీ కొట్టేశాడు
ఓవర్‌నైట్ స్కోర్ 311/4తో ప్రారంభించిన ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించిందంటే స్టోక్స్ ఇన్నింగ్స్‌యే కారణం. 19 పరుగులతో ఆట ప్రారంభించిన స్టోక్స్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఇందుకుతోడు భారత ఫీల్డిండ్ వైఫల్యాలు అతడికి బాగా కలిసొచ్చాయి.

అలస్టిర్ కుక్ వికెట్ తీసిన జడేజా
అంతేగాక, స్టోక్స్‌కు రెండు లైఫ్‌లు కూడా లభించాయి. ఐదో వికెట్‌కు అలీతో కలిసి 52 పరుగులు, ఆరో వికెట్‌కు బెయిర్‌స్టోతో కలిసి 99 పరుగుల విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. చివరకు ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ పట్టడం ద్వారా అతడి ఇన్నింగ్స్ ముగిసింది.

జో రూట్ తీసిన ఉమేశ్ యాదవ్
ఇంగ్లాండ్ జట్టులో రూట్, బెయిర్‌స్టో 2016లో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేయడం మరో విశేషం. భారత పర్యటనలో ఒకే ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ శతకాలు సాధించడం 2009 తర్వాత ఇదే తొలిసారి.

మిస్ ఫీల్డింగ్
తొలి టెస్టులో మొదటి రోజు అలస్టిర్ కుక్ ఇచ్చిన క్యాచ్ ఇచ్చిన క్యాచ్‌ను జార విడిచిన అజింక్యా రహానే. దీనికి భారత్ భారీగానే మూల్యం చేల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications