'సచిన్' ప్రత్యేక షో: స్లేట్ గ్రే జంప్ సూట్‌లో అనుష్క, కొత్త హెయిర్ స్టైల్ కోహ్లీ
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను టీమిండియా బుధవారం వీక్షించింది. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారత ఆటగాళ్లకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఆత్మీయులు, సన్నిహితులు ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవువడ్ నటి అనుష్క శర్మ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉబెర్ చిక్ స్లేట్ గ్రే జంప్ సూట్‌లో అనుష్క, సరికొత్త హెయిర్ స్టయిల్‌లో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ బయల్దేరే ముందు భారత ఆటగాళ్లు సచిన్ సినిమాని వీక్షించారు. ఈ సందర్భంగా టీమిండియా మొత్తం ఒక్క చోట చేరి ఆటపాటలతో సందడి చేసింది.
యువరాజ్ సింగ్ తన డ్యాన్స్‌లతో అక్కడ ఉన్న అందర్ని ఆకట్టుకోగా, ధోని, సచిన్‌ల ముచ్చట్లు హైలెట్‌గా నిలిచాయి. బ్లాక్ సూట్‌లో సచిన్, పింక్ డ్రెస్‌లో అంజలి మెరిసిపోయారు. అంతేకాదు ఈ సినిమా ప్రత్యేక షోకు వచ్చిన అందరికీ సచిన్ జోడీ ఆత్మీయస్వాగతం పలికింది.
మాస్టర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్, సచిన్ సోదరుడు అజిత్ టెండూల్కర్, స్టార్ బాక్సర్ విజేందర్, ప్రముఖ గాయని ఆశాభోంస్లే, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ దంపతులు, పారి శ్రామికవేత్త ముకేశ్ అంబానీ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సచిన్‌తో భారత ఆటగాళ్లు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను టీమిండియా బుధవారం వీక్షించింది. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు.

అనుష్క శర్మతో సచిన్ భార్య అంజలి
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రత్యేక షోకు హాజరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.

సచిన్‌తో ధోని
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో ధోని. సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాని వీక్షించేందుకు వచ్చిన ధోని.

అంజలితో కరచాలనం చేస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను వీక్షించేందుకు తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రీమియర్ షోకు వచ్చిన విరాట్ కోహ్లీ. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు.

ఫోటోలకు ఫోజులు
ఆత్మీయులు, సన్నిహితులు ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి, బాలీవువడ్ నటి అనుష్క శర్మ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉబెర్ చిక్ స్లేట్ గ్రే జంప్ సూట్‌లో అనుష్క, సరికొత్త హెయిర్ స్టయిల్‌లో విరాట్ కోహ్లీ దర్శనమిచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా సచిన్ తనయ, తనయుడు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రత్యేక షోని టీమిండియాకు కోసం ప్రదర్శించారు. ఈ ప్రత్యేక షోని బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ లో ప్రదర్శించారు. ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్, తనయ సారా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications