Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: రెండో టెస్టులో భారత్ విజయం వీరి వల్లే

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా బోణీ చేసింది. సోమవారం విశాఖ వేదికగా ముగిసిన రెండో టెస్టులో 246 పరుగుల ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది.

రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీసి భారత్‌కు 246 పరుగుల విజయాన్ని అందించారు.

ముఖ్యంగా రెండో టెస్టులో టీమిండియా సమిష్ఠి ప్రదర్శనను కనబర్చింది. 87/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్‌ (25), బెయిర్‌స్టో (34 నాటౌట్‌) మాత్రమే కాసేపు పోరాడారు. ప్రత్యర్థి జట్టులో మొత్తంగా ఏడుగురు ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

భారత నిర్దేశించిన 405 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్‌కు చివరి రోజైన సోమవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ 97.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్‌, జయంత యాదవ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. జడేజా, షమి రెండేసి వికెట్లు తీశారు.

విశాఖ టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లు వీరే:

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

'రన్ మెషిన్'గా పేరుగాంచిన విరాట్ కోహ్లీకి ఇది 50వ టెస్టు. ఈ టెస్టులో కోహ్లీ తన కెరీర్‌లో 14 సెంచరీని నమోదు చేశాడు. రెండో టెస్టులో కోహ్లీ మొత్తంగా 248 పరుగులు(తొలి ఇన్నింగ్స్‌లో 167, రెండో ఇన్నింగ్స్‌లో 81) సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. విశాఖ టెస్టులో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌ను సాధించాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

భారత జట్టులో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ రెండో టెస్టులో అరుదైన రికార్డులను నమోదు చేశాడు. రాజ్ కోట్ టెస్టులో కాస్తంత ఒత్తిడిని ఎదుర్కొన్న అశ్విన్ రెండో టెస్టులో మాత్రం చెలరేగిపోయాడు. రెండో టెస్టులో మొత్తం 8 వికెట్లను తీసుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీసుకోవడంతో టెస్టు దిగ్గజాల సరసన చేరాడు. (ఒకే ఇన్నింగ్స్‌లో 22 సార్లు 5 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు) తీసిన టెస్టు దిగ్గజాలు వకార్ యునిస్ (పాకిస్థాన్), మాల్కోమ్ మార్షల్, ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్స్ (ఈ ముగ్గురు వెస్టిండిస్‌కు చెందినవారు) సరసన ఇప్పుడు అశ్విన్ చేరాడు.

ఛటేశ్వర పుజారా

ఛటేశ్వర పుజారా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఛటేశ్వర పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెండో టెస్టులో 119 పరుగులు సాధించిన పుజారా తన కెరీర్‌లో పదో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ-పుజారాలిద్దరూ మూడో వికెట్‌కు 200కు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. విశాఖ టెస్టులో పుజారా సాధించిన సెంచరీ ఇంగ్లాండ్‌పై ఐదో సెంచరీ కావడం విశేషం.

జయంత్ యాదవ్

జయంత్ యాదవ్

హర్యానాకు చెందిన ఈ ఆఫ్ స్ఫిన్నర్ అరంగేట్రం టెస్టులోనే అద్భుత ప్రదర్శనను కనబర్చాడు. 26 ఏళ్ల జయంత్ యావద్ విశాఖ టెస్టులో 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్‌లో 35, రెండో ఇన్నింగ్స్‌లో 27 నాటౌట్‌గా నిలిచాడు. భారత వెటరన్ స్ఫిన్నర్ అమిత్ మిశ్రా స్ధానంలో జయంత్ యాదవ్‌కు చోటు కల్పించారు. విశాఖపట్నంలో స్టేడియంలోనే జయంత్ యాదవ్ తన తొలి వన్డే మ్యాచ్‌ని ఆడటం విశేషం. తన తొలి టెస్టులోనే మంచి ప్రదర్శన కనబర్చడంతో కెప్టెన్ కోహ్లీతో పాటు కామెంటేటర్ల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

రెండో టెస్టులో రవీంద్ర జడేజా అత్యధిక వికెట్లు తీసుకోకపోయినా ఇంగ్లాండ్‌పై భారత్ 264 పరుగుల విజయం సాధించడంలో జడేజాను కూడా తప్పక అభినందించాల్సిందే. రెండో టెస్టులో 63 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+