Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టీ20: బెంగుళూరులో చెమటోడ్చిన ధోని, యువీతో సరదాగా

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల చివరి టీ20 గురువారం రాత్రి 7 గంటలకు బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరగనుంది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఈ టీ20లో ఇరు సత్తా చాటాలని ఊవిళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఇరు జట్లు చెమటోడ్చాయి.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటిదాకా ఇంగ్లండ్‌పై టీమిండియా సిరీస్‌ నెగ్గలేదు. దీంతో ఈ ఆ అవకాశాన్ని వదులు కోకూడదని కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది.

మరోవైపు ఇప్పటికే రెండు సిరీస్‌లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీ20 ఫార్మాట్‌లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రెండో టీ20లో విజయం నుంచి అనూహ్యంగా ఓడిపోవడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తీవ్రంగా నిరాశ చెందాడు. భారత పర్యటనలో టెస్టు, వన్డే సిరిస్‌ని కోల్పోయినా.. టీ20 సిరిస్‌ను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

చిన్నస్వామి స్టేడియాన్ని పునరుద్ధరించిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే. ఇటీవల రూ. 4.5 కోట్లతో మైదానాన్ని అధునాతనంగా మార్చారు. అవుట్‌ ఫీల్డ్‌ను మాత్రం కొత్తగా తీర్చిదిద్ది అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యాలు కల్పించారు. పిచ్‌ మాత్రం ఎప్పటిలాగే బ్యాటింగ్‌కు అనుకూలం. బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ షాట్లకు అవకాశం ఉందని క్యురేటర్‌ శ్రీరామ్‌ చెప్పాడు.

ధోని నెట్ ప్రాక్టీస్

ధోని నెట్ ప్రాక్టీస్

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియం నెట్స్ లో ప్రాక్టీస్ చేసున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.

నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు

నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసున్న టీమిండియా ఆటగాళ్లు.

ప్రాక్టీస్‌కు వస్తున్న ధోని

ప్రాక్టీస్‌కు వస్తున్న ధోని

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేసేందుకు వస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.

ధోని-యువీ ప్రాక్టీస్

ధోని-యువీ ప్రాక్టీస్

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్.

బుమ్రాకి ధోని సలహాలు

బుమ్రాకి ధోని సలహాలు

బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని, బుమ్రా. బుమ్రా ఏదో చెబుతుండగా అటువైపే చూస్తున్న ధోని.

సురేశ్ రైనా

సురేశ్ రైనా

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సురేశ్ రైనా.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌కి వస్తున్న వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్.

కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో పుట్ బాల్ ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు

ఇంగ్లాండ్ ఆటగాళ్లు

మూడో టీ20 సందర్భంగా బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో పుట్ బాల్ ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.

మోర్గాన్ మాటామంతీ

మోర్గాన్ మాటామంతీ

మూడో టీ20 సందర్భంగా చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లతో సరదాగా ఏదో చెబుతున్న కెప్టెన్ మోర్గాన్.

ప్రాక్టీస్ సెషన్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు

ప్రాక్టీస్ సెషన్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు

మూడో టీ20 సందర్భంగా చిన్నసామి స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+