సూపర్ సెంచరీ, జాగ్రత్తగా ఆడానన్న రహానే
కింగ్ స్టన్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. అజింక్యా రహానే సెంచరీ చేశాడు. దీంతో, భారత్ ఇప్పటికే 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానే 237 బంతుల్లో 108 పరుగులు చేశాడు. అంతకుముందు కెఎల్ రాహుల్ కూడా 158 పరుగులు చేశాడు.
అజింక్యా రహానేకు ఇది టెస్టుల్లో ఇది ఏడో సెంచరీ. భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి, 500 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు వెస్టిండీస్ కేవలం 196 పరుగులే చేసింది. దీనిపై రహానే మాట్లాడుతూ... రెండో టెస్టులో సెంచరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోలేదన్నాడు.

అజింక్యా రహానే
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అనంతరం రహానే మాట్లాడాడు. తొలి టెస్టులో త్వరగా పెవిలియన్ చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని తెలిపాడు.

అజింక్యా రహానే
అప్పుడే ఇలా జరగకుండా చూసుకోవాలని భావించానని చెప్పాడు. అందుకే భారీ షాట్లపై దృష్టి పెట్టకుండా ఫుట్ వర్క్ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టానని తెలిపాడు.

అజింక్యా రహానే
విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని రహానే కితాబిచ్చాడు. దీంతో సాహా అవుటయ్యాడని, అనంతరం లోయర్ ఆర్డర్‌తో కలిసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించానన్నాడు.

అజింక్యా రహానే
తొలి టెస్టులో విరాట్ కోహ్లీకి జతగా అశ్విన్ సెంచరీతో భారీ స్కోరు సాధనలో భాగం కాగా, రెండో టెస్టులో కేఎల్ రాహుల్ చేసిన భారీ స్కోరుకి రహానే చేసిన సెంచరీ (108) దోహదపడింది.

అజింక్యా రహానే
దీంతో టీమిండియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే 300 పైచిలుకు పరుగుల ఆధిక్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications