రాంచీ : మహేంద్ర సింగ్ ధోనీ.. టీమ్ ఇండియా కెప్టెన్. ఓ ప్రొఫెషనల్ క్రికెటర్.. అయితే ప్రొఫెషన్ నుంచి కాస్త విరామం దొరకడంతో ఇతర ప్రొఫెషన్స్ పై కూడా ప్రయోగాలు చేసేస్తున్నాడు ధోనీ. తాజాగా ఓ మార్బుల్ పాలిషర్ అవతారమెత్తిన ధోని.. ఇదంతా ఈజీ పని కాదంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను షేర్ చేశాడు.
మార్బుల్ పాలిషింగ్ చాలా కష్టంగా అనిపించిందని.. కొన్ని పనులకు ప్రొఫెషనల్స్ అయితేనే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించాడు ధోని. అంతే కదా మరి..! హెలికాప్టర్ సిక్సర్ ధోనికే ఎలా సాధ్యమో..! కొన్నిపనులు కూడా ప్రొఫెషనల్స్ కే సాధ్యం. ఇకపోతే టెస్టు కెప్టెన్ గా రిటైర్ మెంట్ ప్రకటించాక.. ఇంటి పట్టున ఉండడానికి ధోనికి కాస్త విరామం దొరుకుతుండడంతో.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు.