Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లా పైత్యం: తెగిన ధోనీ తలతో తస్కిన్(ఫొటో)

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ అభిమానుల పైత్యం పరాకాష్ఠకు చేరుకుది. ఆసియాక్‌పలో ఫైనల్‌కు ముందు ఓ బంగ్లా ఫ్యాన్‌ సోషల్‌ మీడియాలో శనివారం పోస్ట్‌ చేసిన ఫొటోపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా ఫాస్ట్‌ బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్‌.. టీమిండియా కెప్టెన్‌ కెప్టెన్‌ ధోనీ తలను పట్టుకెళ్తున్నట్టు గ్రాఫిక్‌ చేసిన ఫొటో సగటు భారత క్రికెట్‌ అభిమాని రక్తాన్ని మరిగిస్తోంది.

బంగ్లా అభిమానులు ఇలాంటి చెత్త పనులు చేయడం ఇదే మొదటిసారి కాదు. నిరుడు బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియా వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడిపోయింది. బంగ్లా యువ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ధాటికి ధోనీసేన కుదేలైంది. దీంతో ఆ సిరీస్‌ ముగిసిన వెంటనే.. టీమిండియా క్రికెటర్లు అరగుండుతో ఉన్న ఫొటోనూ ప్రచురించింది.

Photo of Mahendra Singh Dhoni's Chopped Head Being Held by Bangladesh Pacer on Twitter Goes Viral

ముస్తాఫిజుర్‌ కట్టర్లకు భారత ఆటగాళ్లు బిత్తరపోయారని ఎగతాళి చేస్తూ ఉన్న ఫొటో అప్పట్లో వివాదాస్పదమైంది. ఇప్పుడు ఏకంగా ధోనీ తలను పట్టుకున్న ఫొటో దర్శనమివ్వడాన్ని అతని ఫ్యాన్స్‌ తోపాటు సగటు భారతీయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

కాగా శ్రీలంక, పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లా ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమవడంతో తుదిపోరుపై ఉత్కంఠ పెరిగింది. ఫైనల్లో మోర్తజాసేన వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌తో ఆదివారం తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+