బెంగుళూరు: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతురు 'జివా'కి సంబంధించిన తొలి ఫోటో సోషల్ మీడియాలో హాల్‌చల్ సృష్టిస్తోంది. ధోని భార్య సాక్షి సింగ్ తన ట్విట్టర్ ద్వారా ఈ చిత్రాన్ని ట్వీట్ చేసింది.
గుర్గావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 6 (శుక్రవారం)నాడు ధోని భార్య ఓ బేబీ గర్ల్‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కెప్టెన్ ధోని ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడేందుకు ఆస్టేలియాకి పయనమైన విషయం తెలిసిందే.

మార్చి 2న ధోని భార్య సాక్షి సింగ్ తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో తన ముద్దుల కూతురు 'జివా' ఫోటోను ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో చిన్నారి జీవా, అమ్మ చేతిని మృదువుగా పట్టుకుని ఉంది. ఈ ఫోటో కింద ధోని భార్య Bundle of Joy !! అని రాసింది. జీవా అనేది పర్షియన్ భాషకు చెందిన పదం. ఈ పదానికి అర్థం 'అందం'.
ధోని ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్టేలియాలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా సారధ్య బాధ్యతలను సక్రమంగా వహిస్తున్న ధోని భారత్‌కు మూడు వరుస విజయాలను అందించాడు. టోర్నమెంట్‌లో పాకిస్ధాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. టోర్నమెంట్లో తదుపరి మ్యాచ్ మార్చి 6 (శుక్రవారం)న వెస్టిండిస్‌తో తలపడనుంది.