స్కూటీతో ధోనిని చేజ్ చేసిన అమ్మాయి.. మొత్తానికి సాధించేసింది (ఫోటోలు)
రాంచీ : సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి టీమ్ ఇండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎదిగిన ఎంఎస్ ధోని దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మైదానంలో ధోని సిక్సర్లకు వెర్రెత్తిపోయే అభిమానులు.. ఇక రోడ్డు మీద రయ్యిమని దూసుకుపోతున్న ధోనిని చూస్తే ఊరుకుంటారా!
రాంచీలో ధోని అభిమాని అయిన ఆరాధ్య అనే అమ్మాయి స్కూటీతో ధోనిని చేజ్ చేసి మరీ అతనితో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి తన సంతోషాన్ని స్నేహితులతో పంచుకుంది. రాంచీలోని ఓ ఉమెన్స్ కాలేజీలో చదువుతోన్న ఆరాధ్యకు ఎప్పటినుంచో ధోనితో ఒక సెల్ఫీ దిగాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది.

నాలుగో వన్దే నాడు.. ఆరాధ్య చేజ్..
భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే తర్వాత ధోని తన హమ్మర్ కారులో విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ధోని హమ్మర్ కారులో బయల్దేరిన విషయం తెలుసుకున్న ఆరాధ్య ధోనిని చేజ్ చేసేందుకు తన స్కూటీతో బయల్దేరింది.

మొత్తానికి సెల్ఫీ కల నెరవేరింది
ధోనిని చేజ్ చేస్తూ వెళ్లిన ఆరాధ్య.. విమానాశ్రయం వద్దకు చేరుకోగానే.. ధోనిని కలుసుకుని సెల్ఫీ ప్లీజ్ అంటూ ధోనిని రిక్వెస్ట్ చేసింది ఆరాధ్య. అభిమాని కోరికను మన్నించి ఆమెతో సెల్ఫీ దిగేశాడు మహీ. దీంతో ఆరాధ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ధోనిని చూసి.. 'వావ్' అన్న న్యూజిలాండ్ క్రికెటర్లు
నాలుగో వన్డే తర్వాత ధోని.. తన హమ్మర్ కారులో దూసుకెళ్తుంటే.. బస్సులో హోటల్ కు బయల్దేరిన న్యూజిలాండ్ క్రికెటర్లు ధోనిని చేసి నోరెళ్లబెట్టారు. ఎంతైనా ధోని లోకల్ కదా.. అందుకే అలా తన కారులో రోడ్ల మీద రయ్యిమని దూసుకెళ్లిపోయాడు.

ధోనికి బైక్స్, కార్లపై ఉన్న ప్రేమ తెలిసిందే..
ఎంఎస్ ధోనికి బైక్స్, కార్లంటే యమా క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధోని దగ్గర పలు స్పోర్ట్స్ బైక్స్ తో పాటు పలు రేసింగ్ కార్లు కూడా ఉన్నాయి. మ్యాచ్ ల మధ్యలో వీలు చిక్కినప్పుడల్లా వీటితో రైడ్ కి వెళ్లడం ధోనికి చాలా ఇష్టమైన వ్యాపకం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications