న్యూఢిల్లీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు ట్వంటీ20ల సిరిస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులో చేరాడు. ఈ వారం నుంచి బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియాతో కలిసి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు బయల్దేరి వెళ్లాడు.
ఈ సందర్భంగా ఢాకాకు విమానంలో వెళ్తున్నప్పటి ఫొటోను కోహ్లీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మధ్యలో కూర్చుని కోహ్లీ ఫోటోకు ఫోజిచ్చాడు. లెజెండ్ కంపెనీతో కలసి ఢాకా వెళ్తున్నానంటూ కోహ్లీ తన సందేశాన్ని పోస్టు చేశాడు.

ఆసియా కప్ టోర్నమెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో బుధవారం నాడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ అనంతరం భారత్‌లో జరగనున్న వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో వీరే కీలక ఆటగాళ్లు. ఆస్ట్రేలియాతో ఆడిన మూడు ట్వంటీల సిరీస్‌ను ధోనీ సేన క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడు ట్వంటీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ట్వంటీ20 క్రికెట్‌లో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.