Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్ టీమ్‌లో టికెట్ చిరిగింది - పెద్ద తలకాయ అవుట్..!!

Phil Simmons has resigned as West Indies coach after the team early exit from the T20 World Cup 2022


సెయింట్ జాన్స్: టీ20 ప్రపంచకప్ హిస్టరీలో ఏ జట్టుకూ లేని ఘనత వెస్టిండీస్‌కు ఉంది. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించగా.. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది విండీస్. ఈ క్రెడిట్ మరే జట్టుకూ లేదు.. టీమిండియాతో సహా. 2012, 2016లో విజేతగా నిలిచారు కరేబియన్ వీరులు. 2012లో శ్రీలంకను వారి స్వదేశంలో ఓడించి- కప్‌ను ముద్దాడింది. 2016లో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. రెండోసారి కప్‌ అందుకుంది.
రేస్ నుంచి అవుట్..

రేస్ నుంచి అవుట్..

అలాంటి వెస్టిండీస్ జట్టు- ఈ టీ20 ప్రపంచకప్ 2022లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. సూపర్ 12కు చేరుకోలేక చేతులెత్తేసింది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లను ఆడిన వెస్టిండీస్ రెండిట్లో ఓడింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దారుణంగా పరాజయాన్ని చవి చూసింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. 118 పరుగులకే కుప్పకూలిందా జట్టు బ్యాటింగ్ ఆర్డర్. ఏకంగా 42 పరుగుల తేడాతో పరాభవం పాలైంది.

రెండో రౌండ్‌కు చేరుకోలేక..

రెండో రౌండ్‌కు చేరుకోలేక..

రెండో మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయాన్ని సాధించినప్పటికీ- అది ఏమాత్రం హెల్ప్ కాలేదు. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడంతో సూపర్ 12 రేసు నుంచి తప్పుకోక తప్పలేదా జట్టుకు. విండీస్ నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా కొట్టిపడేసింది ఐర్లాండ్. ఒక వికెట్ నష్టానికి 150 పరుగులతో విజయఢంకా మోగించింది. దీని దెబ్బకు రెండో రౌండ్‌కు చేరుకోలేక ఇంటిదారి పట్టింది.

హెడ్ కోచ్ రిజైన్..

హెడ్ కోచ్ రిజైన్..

దీని ప్రభావం వెస్టిండీస్‌పై తీవ్రంగా పడింది. జట్టు పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ రాజీనామా చేశారు. తమ ఓటమి జట్టును మాత్రమే కాదని, క్రికెట్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరినీ బాధపెడుతోందని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు.

సారీ చెబుతూ..

సారీ చెబుతూ..

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సూపర్ 12 చేరలేకపోయినందుకు క్షమించాల్సిందిగా కోరారు. తన రాజీనామాకు టీ20 ప్రపంచకప్ ఓటమి కారణం కాదని వివరించారు. ఇది వరకు ఆయన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తోన్నానని గుర్తు చేశారు.

సిమ్మన్స్ హయాంలోనే..

సిమ్మన్స్ హయాంలోనే..

కోచ్ పదవి నుంచి తప్పుకొంటానని ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలోనే తాను ప్రతిపాదించానని పేర్కొన్నారు. సిమన్స్ అంతకుముందు టీ20 ప్రపంచకప్ 2016ను గెలిచిన వెస్టిండీస్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఇంగ్లండ్‌పై 1-0 టెస్ట్ సిరీస్‌ను వెస్టిండీస్‌ గెలిచినప్పుడు ఆయనే హెడ్ కోచ్. సిమ్మన్స్ హయాంలోనే విండీస్ జట్టు రిచర్డ్స్-బోథమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, October 25, 2022, 10:41 [IST]
Other articles published on Oct 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+