Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS RCB: ఆఖరి ఓవర్.. మ్యాచు మలుపు తిప్పిన స్టన్నింగ్ క్యాచ్!!

ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 12 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. అయితే ఈ థ్రిల్లింగ్ మ్యాచు విజయంలో ఓ స్టన్నింగ్ క్యాచ్ కీలక పాత్ర పోషించింది. ముంబయి ఛేదనలో చివరి ఓవర్లో పట్టుకున్న ఓ సూపర్ క్యాచ్ మ్యాచ్ గమనాన్ని మార్చి విజయాన్ని ఆర్సీబీకి కట్టబెట్టింది.

సిక్స్ అనుకుంటే స్టన్నింగ్ క్యాచుగా..
చివరి ఓవర్లో ముంబయి విజయానికి 19 పరుగులు అవసరమైన సమయంలో కృనాల్ బౌలింగ్ లో దీపక్ చాహర్ భారీ షాట్ సిక్స్ బాదాడు.కానీ అది కాస్త సిక్స్ గా మారకుండా ఆర్సీబీ ఆటగాడు సాల్ట్ బంతిని అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న టిమ్ డేవిడ్ కు బంతి అందించాడు. అలా కీలక సమయంలో పట్టిన ఈ అసాధారణమైన క్యాచ్ మ్యాచును కీలక మలుపు తిప్పింది.

Phil Salt Tim David Stunning Catch turned match and helps RCB won against Mumbai indians IPL 2025

బ్యాలెన్స్ తప్పినా.. బంతి గురి తప్పలే..
కృనాల్ పాండ్యా.. ఓవర్ మొదటి బంతికే మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేసి ముంబయి ఇండియన్స్‌పై ఒత్తిడి పెంచాడు. ఆ స్థితిలో, చాహర్ భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే చాహర్ భారీ షాట్ ఆడాడు. కానీ వికెట్ కీపర్ అయిన ఫిల్ సాల్ట్.. ఒక్కసారిగా సీనులోకి డీప్ మిడ్ వికెట్ మీదుగా పరుగెత్తుకుంటూ వచ్చి.. క్యాచ్ పట్టి బ్యాలెన్స్ తప్పాడు. కానీ అంతలోనే.. ఆ బంతిని తన దగ్గర్లో ఉన్న టిమ్ డేవిడ్ వైపునకు విసిరేశాడు. వెంటనే స్పందించిన డేవిడ్ ఆ బంతిని పట్టుకుని వికెట్ కూల్చడానికి సహకరించాడు. ఈ క్యాచుతో మ్యాచ్ మలువు తిరిగింది. దీంతో చివరి నాలుగు బంతుల్లోనూ ముంబయికి 19 పరుగులు అవసరమయ్యాయి. కానీ ముంబయి ఛేదించలేక చేతులెత్తేసింది.

Story first published: Tuesday, April 8, 2025, 10:36 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+