Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్‌మ్యాన్‌లా దూకి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన ఆర్సీబీ స్టార్! (వీడియో)

ఇంగ్లండ్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ ప్రపంచంలోని ఉత్తమ ఫీల్డర్లలో ఒకరిగా ఎందుకు పరిగణించబడ్డాడో మరోసారి నిరూపించుకున్నారు. ఇంగ్లండ్ టీ20 లీగ్ అయిన 'ది హండ్రెడ్' టోర్నమెంట్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున ఆడుతున్న ఫిల్ సాల్ట్.. ట్రెంట్ రాకెట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌మ్యాన్‌లా దూకి ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లోని 48వ బంతికి ఈ అద్భుతం జరిగింది.

ట్రెంట్ రాకెట్స్ జట్టు 100 బంతుల్లో 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. జోష్ టంగ్ వేసిన ఒక స్లో బాల్‌ను మాక్స్ హోల్డెన్ కొట్టగా.. బంతి నేరుగా మిడ్-ఆఫ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్ వైపు వెళ్లింది. బంతిని అందుకునేందుకు పులిలా దూకి.. ఒంటి చేత్తో పట్టుకున్నాడు. ఆ సమయంలో ఫిల్ సాల్ట్ తన బ్యాలెన్స్ కోల్పోకుండా అద్భుతంగా బంతిని అందుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఫిల్ సాల్ట్ బంతిని నేల మీద పడకుండా అద్భుతమైన ల్యాండింగ్ చేశాడు. సాధారణంగా వికెట్ కీపర్‌గా వ్యవహరించే ఫిల్ సాల్ట్.. చాలా అరుదుగా గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తారు. అయితే వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో, మైదానంలో కూడా అంతే చురుగ్గా ఉంటానని నిరూపించారు.

Phil Salt s Superhuman Catch in The Hundred Unreal Fielding Moment Video Goes Viral

అయినప్పటికీ ఓడిన జట్టు
ఈ అద్భుతమైన క్యాచ్ పట్టినప్పటికీ ఫిల్ సాల్ట్ మాత్రం అంత సంతోషంగా లేడు. ఎందుకంటే అప్పటికే సాల్ట్ జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్ దాదాపుగా ఓడిపోయింది. అంతకుముందు ఫిల్ సాల్ట్ కేవలం 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు, ఇది ఒరిజినల్స్ జట్టులో రెండో అత్యధిక స్కోర్. డేవిడ్ విలీ అద్భుతమైన స్పెల్ (3/11) కారణంగా మాంచెస్టర్ ఒరిజినల్స్ స్కోరు 98/8 వద్ద ఆగిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్ 45 (35) పరుగులు చేసి ట్రెంట్ రాకెట్స్ జట్టుకు విజయం అందించాడు. ఈ విజయంతో ట్రెంట్ రాకెట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా.. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఆరో స్థానంలో ఉన్నాయి.

Story first published: Wednesday, August 20, 2025, 14:10 [IST]
Other articles published on Aug 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+