Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లేఆఫ్స్ వేళ.. ఆర్సీబీకి గుడ్ న్యూస్

ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ మ్యాచ్ లన్నీ కూడా ముగింపుదశకు వచ్చేశాయి. మూడు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకున్నాయి కూడా. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం అయిదు జట్లు.. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.

ఈ పరిస్థితుల మధ్య ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. నెల రోజులుగా వేలి గాయంతో దూరమైన ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరలో తిరిగి భారత్‌కు రానున్నాడు. జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీని ఆపే ప్రయత్నంలో డైవ్ చేయగా, అతని ఎడమ చేతి వేలికి గాయమైంది. ఆ తర్వాత అతను ఎటువంటి మ్యాచ్ ఆడలేదు. స్వదేశానికి వెళ్ళాడు.

Phil Salt is set to return to India later this week after a month sidelined from the IPL with injury

సాల్ట్ లేనప్పటికీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. నెట్ రన్ రేట్ లో పెద్దగా మార్పులు లేకపోతే వచ్చే మంగళవారం ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1కు చేరుకునే అవకాశం ఉంది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ ఆడతాడా లేదా అనేది స్పష్టంగా తెలియరావట్లేదు. ప్లేఆఫ్స్ సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా జట్టు సిద్ధంగా లేదు.

సాల్ట్ అందుబాటులో లేని సమయంలో విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ భాగస్వామిగా జాకబ్ బెథెల్ ఆడాడు. అతను పెద్దగా ప్రభావం చూపలేదు. తన స్థాయికి తగ్గ ఇన్నింగ్ ఆడలేదు. ఏడు ఇన్నింగ్స్‌లలో 27 అత్యధిక స్కోరుతో 96 పరుగులు మాత్రమే చేశాడు. ఆదివారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ 73 నాటౌట్ పరుగులు చేయడంతో, సాల్ట్ అందుబాటులో లేకపోయినా శుక్రవారం నాటి మ్యాచ్‌కి బెథెల్ స్థానానికి సంకటం ఎదురయ్యే అవకాశం ఉంది.

వెంకటేష్ ఐయ్యర్.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్థానంలో ఆడాడు. గత వారం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన కార్తీక్ త్యాగి బౌన్సర్‌కు పాటిదార్ హెల్మెట్‌కు బలంగా తగలడంతో అతను ధర్మశాలకు రాలేదు. ఆ మ్యాచ్ కు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కేప్టెన్ గా వ్యవహరించాడు. శుక్రవారం హైదరాబాద్‌లో సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్‌ నాటికి పటిదార్ జట్టుకు అందుబాటులోకి రావడం ఖాయం. అదే సమయానికి ఫిల్ సాల్ట్ కూడా జట్టుతో కలిసే అవకాశం ఉంది.

Story first published: Wednesday, May 20, 2026, 15:45 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+