For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఛీ.. సిగ్గుచేటు': మాజీ ఆటగాడి పోస్టుపై ఫిలిప్ సాల్ట్ ఫైర్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఆర్సీబీ అద్భుత విజయం సాధించింది. ఈ విజయం తర్వాత స్టేడియంలో ఆటగాళ్ల మధ్య ఉన్న అనుబంధం సోషల్ మీడియా వేదికగా బయటపడింది. ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తీక్ పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ చేసిన కామెంట్ ఇప్పుడు నెటిజన్లను నవ్విస్తోంది.

అసలేం జరిగిందంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న ఇషాన్ కిషన్‌ను ఫిలిప్ సాల్ట్ ఓ అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్‌తో అడ్డుకున్నాడు. పాయింట్ దిశగా పరిగెత్తుకుంటూ వెళ్లిన ఫిలిప్ సాల్ట్.. గాలిలోకి దూకి ఒంటి చేత్తో ఆ క్యాచ్‌ను అందుకున్న తీరు ఈ సీజన్‌లోనే బెస్ట్ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, జాకబ్ డఫీ ఫోటోలను షేర్ చేస్తూ.. "పర్ఫెక్ట్ స్టార్ట్" అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఇందులో సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఫోటో ఎక్కడా లేదు.

Phil Salt Hilarious Shame Comment on Dinesh Karthik Post After RCB Record Win vs SRH

సాల్ట్ రియాక్షన్: 'ఛీ.. సిగ్గుచేటు!'
తన క్యాచ్ ఫోటోను దినేష్ కార్తీక్ పెట్టకపోవడంతో ఫిలిప్ సాల్ట్ సరదాగా స్పందించాడు. "ఆ మాస్టర్‌మైండ్ క్యాచ్ గురించి ఏమీ లేదా? ఛీ.. సిగ్గుచేటు " అంటూ కామెంట్ చేశాడు. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో దినేష్ కార్తీక్‌ను అందరూ 'మాస్టర్‌మైండ్' అని పిలుస్తారని సాల్ట్, టిమ్ డేవిడ్ కామెంట్లను బట్టి అర్థమవుతోంది.

చిన్నస్వామిలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ విధ్వంసం
ఫిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయినప్పటికీ.. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ రాకెట్ వేగంతో ఛేదించింది. దేవదత్ పడిక్కల్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి హైదరాబాద్ బౌలర్లను ఉతికేసాడు. విరాట్ కోహ్లీ తన ట్రేడ్‌మార్క్ డ్రైవ్‌లు, సిగ్నేచర్ స్పాట్ ఫ్లిక్‌లతో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మెరుపులతో ఆర్సీబీ పవర్‌ప్లేలోనే 76 పరుగులు సాధించి.. కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని రికార్డు సృష్టించింది.

Story first published: Sunday, March 29, 2026, 13:27 [IST]
Other articles published on Mar 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+